iDreamPost

స్కూల్లో ప్రిన్సిపాల్ చెత్త పని! వీడియో తీస్తున్న టీచర్ పై దారుణంగా!

పాఠాలు నేర్పాల్సిన విద్యా సంస్థలను పంతులమ్మలు బ్యూటీ కేర్ కేంద్రాలుగా మార్చేస్తున్నారు. తరగతి గదిలోనే అద్దం తీసుకుని తమ అందానికి మెరుగులు దిద్దుతుంటారు. తాజాాగా ఓ ప్రిన్సిపాల్ కూడా ఇదే నిర్వాకానికి పాల్పడింది.

పాఠాలు నేర్పాల్సిన విద్యా సంస్థలను పంతులమ్మలు బ్యూటీ కేర్ కేంద్రాలుగా మార్చేస్తున్నారు. తరగతి గదిలోనే అద్దం తీసుకుని తమ అందానికి మెరుగులు దిద్దుతుంటారు. తాజాాగా ఓ ప్రిన్సిపాల్ కూడా ఇదే నిర్వాకానికి పాల్పడింది.

స్కూల్లో ప్రిన్సిపాల్ చెత్త పని! వీడియో తీస్తున్న టీచర్ పై దారుణంగా!

నేటి బాలల్ని, రేపటి పౌరులుగా మార్చే శక్తి కేవలం అక్షరమనే ఆయుధానికి ఉంది. చదువుతో పాటు సంస్కారం నేర్పే ఆలయాలు విద్యా సంస్థలు. అందులో ఉండే దేవుళ్లే టీచర్లు. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి, ప్రయోజకులను చేసేది టీచర్లే. కానీ నేడు విద్య కమర్షియల్ రంగులు పులుముకుంది. ఉదయం 8 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు జీతానికి పనిచేసే కూలీలుగా మారిపోయారు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు. మొక్కుబడిగా పాఠాలు చెప్పడం, నెలసరి జీతం తీసుకోవడం, పిల్లలను సరిగ్గా పట్టించుకోపోవడం చేస్తున్నారు. ఇక పంతులమ్మలైతే.. బ్యూటీ పార్లర్ చేసేస్తున్నారు. తాజాగా అటువంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.

పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ప్రధాన ఉపాధ్యాయురాలు.. అందానికి మెరుగులు దిద్దుకునే పనిలో బిజీ అయిపోయింది. ఇది గమనించిన మరో టీచర్.. వీడియో తీస్తుండగా.. ఆ మహిళ ప్రిన్సిపాల్ ఆమెపై రాయితో దాడి చేయడమే కాదు.. చేతిని గట్టిగా కొరికేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావాలోని ఓ పాఠశాలలో జరిగింది. దాదామౌ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ సంగీతా సింగ్ క్లాస్ తీసుకోకుండా.. వంటగదిలో కూర్చుని ఫేషియల్ చేయించుకుంటోంది. అయితే మరో అసిస్టెంట్ టీచర్ అనమ్ ఖాన్.. ఆమె ఏమైందని వెతుకగా.. వంటగదిలో తన బ్యూటీకి మెరుగులు దిద్దించుకుంటున్న సంగీతా మేడమ్‌ను చూసింది. వెంటనే తన ఫోనులో వీడియో తీసింది.

ఇంతలో అనమ్ ఖాన్ చాలా బాగుంది మీ పని అంటూ అరుచుకుంటూ గదిలోకి వెళ్లగానే ఉలిక్కి పడి లేచిన ప్రిన్సిపాల్.. అనమ్ ఖాన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఫోనులో రికార్డ్ చేయడం ఆపు అంటూ.. అసిస్టెంట్ టీచర్‌పై దాడి చేసింది. ఆమెను కొట్టడంతో పాటు చేతిని కొరికేసింది సంగీతా సింగ్. కాగా, ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది అనమ్ ఖాన్. అనంతరం అనమ్ ఖాన్.. సంగీతా సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత టీచర్ ను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. ప్రధాన ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై లోతైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి