Tirupathi Rao
Tirupathi Rao
టాలీవుడ్ చరిత్రలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. బన్నీకి అవార్డు రావడంపై పాన్ ఇండియా లెవల్లో శుభాకాంక్షలు, ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ప్రశంసల వర్షం కురిపించారు. జాతీయ అవార్డులు దక్కించుకున్న చిత్రాల సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఆస్కార్ అవార్డు కూడా గెలుస్తాడంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. “తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావడం సంతోషంగా ఉంది. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. నేనంటే అల్లు అర్జున్ కు చాలా ఇష్టం. అల్లు అర్జున్ జాతీయ అవార్డు మాత్రమే కాదు.. ఆస్కార్ అవార్డు కూడా వస్తుంది. బన్నీలో ఒక గొప్ప లక్షణం ఉంది. అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఉన్నప్పటికీ ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాడు. అల్లు అర్జున్ ఇలాగే నిత్యం నేర్చుకుంటూ ముందుకు వెళ్లే.. భవిష్యత్ లో ఆస్కార్ అవార్డు కూడా దక్కే అవకాశం ఉంది. బన్నీ భవిష్యత్ లో మరిన్ని అవార్డులు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు.
2021 సంవత్సరానికి గానూ.. గురువారం ప్రకటించిన 69వ జాతీయ అవార్డుల్లో అల్లు అర్జున్ కు ఉత్తమ జాతీయ నటుడు అవార్డు దక్కగా.. అలియా భట్, కృతి సనన్ కు ఉత్తమ జాతీయ నటి అవార్డు దక్కింది. పుష్ప సినిమాకి గాను దేవీశ్రీ ప్రసాద్ కి ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దక్కింది. రామ్ చరణ్ తో ప్రాజెక్టు చేయబోతున్న డైరెక్టర్ బుచ్చిబాబు చిత్రం ఉప్పెన కు బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కింది. ట్రిపులార్ సినిమాకు 7, పుష్ప సినిమాకి 2 అవార్డులు దక్కాయి. జాతీయ అవార్డుల్లో తెలుగు చలనచిత్రాలు సత్తా చాటాయనే చెప్పాలి. పాన్ ఇండియా లెవల్లో జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి.
ALLU ARJUN completes 50 awards milestone with the winning of ‘Best Actor’ National Award.
||#Pushpa | #AlluArjun | #Pushpa2TheRule || pic.twitter.com/KsyQDfSYvC
— Manobala Vijayabalan (@ManobalaV) August 25, 2023