iDreamPost

Tenant Movie In Another OTT:మరో OTT లోకి సత్యం రాజేష్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ..

  • Published Jun 25, 2024 | 8:24 PMUpdated Jun 25, 2024 | 8:24 PM

ఒకప్పుడు ఒక సినిమాను ఒక ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోనే స్ట్రీమింగ్ కు వచ్చేది. కానీ ఇప్పుడు ఒకేసారి రెండు ఓటీటీ లలోకి కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సత్యం రాజేష్ నటించిన ఓ సినిమా మరొక ఓటీటీ లోకి వచ్చేస్తుంది.

ఒకప్పుడు ఒక సినిమాను ఒక ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోనే స్ట్రీమింగ్ కు వచ్చేది. కానీ ఇప్పుడు ఒకేసారి రెండు ఓటీటీ లలోకి కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సత్యం రాజేష్ నటించిన ఓ సినిమా మరొక ఓటీటీ లోకి వచ్చేస్తుంది.

  • Published Jun 25, 2024 | 8:24 PMUpdated Jun 25, 2024 | 8:24 PM
Tenant Movie In Another OTT:మరో OTT లోకి సత్యం రాజేష్ సస్పెన్స్ మిస్టరీ  థ్రిల్లర్ మూవీ..

కథ బావుంటే కనుక ఆ సినిమాలలో ఆర్టిస్ట్ లతో సంబంధం లేకుండా ఆయా సినిమాలను హిట్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నటుడు సత్యం రాజేష్ నటించిన సినిమాలు ప్రేక్షకులను బాగానే మెప్పిస్తున్నాయి. రీసెంట్ గా ఇతను నటించిన నటించిన పొలిమేర 2 సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత అలాంటి జోనర్ లోనే చేసిన మరొక సినిమా టెనెంట్. ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా కూడా.. ఓటీటీ ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకుంది. టెనెంట్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా మరొక ఓటీటీ లోకి కూడా వచ్చేసింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లో ఉందొ చూసేద్దాం.

సత్యం రాజేష్ నటించిన సినిమా ఏప్రిల్ లో థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ థియేటర్ లో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఓటీటీ లో కూడా ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. జూన్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఓటీటీ లో మాత్రం ఈ సినిమా మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్ తో పాటు మేఘా చౌదరి, భ‌ర‌త్‌ కాంత్, చందన పయావుల, ఆడుకాలం నరేన్, ఎస్త‌ర్ ముఖ్య పాత్రలలో నటించారు. ఓటీటీ లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో.. ఇప్పుడు ఈ సినిమా మరొక ఓటీటీ లోకి కూడా రాబోతుంది. జూన్ 28 నుంచి ఈ సినిమా ఆహా ప్లాట్ ఫార్మ్ లోకి రానుంది. కాబట్టి ఇక ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ తో పాటు.. ఆహాలో కూడా ఈ సినిమాను చూసేయొచ్చు. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. స‌త్యం రాజేష్‌ త‌న మ‌ర‌ద‌లు సంధ్య‌ను పెళ్లి చేసుకుని… హైదరాబాద్ లో కాపురం పెడతాడు. కొద్దీ రోజులు సాఫీగా సాగిపోయినా వారి జీవితంలో అనుకోకుండా విభేదాలు ఏర్పడతాయి. అనుకోకుండా సంధ్య హత్యకు గురవుతుంది. అదే రోజు రాజేష్ పక్క ఫ్లాట్ లో ఉండే రిషి అని అబ్బాయి బిల్డింగ్ పై నుంచి సూసైడ్ చేసుకుంటాడు. మరోవైపు రిషిని ప్రేమించిన వైష్ణవి అనే అమ్మాయి కనిపించకుండా పోతుంది. సంధ్యను రాజేష్ ఏ హత్య చేశాడని పోలీసులు రాజేష్ ను అరెస్ట్ చేస్తారు. సంధ్యను చంపింది ఎవరు ! రిషికి సంధ్యకు మధ్య ఏదైనా సంబంధం ఉందా ! రిషిని ప్రేమించిన అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ! వీటి అన్నిటికి ఏదైనా లింక్ ఉందా ! ఈ సస్పెన్స్ వీడాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి