iDreamPost

Family Star In Another OTT: మరో భాషలో మరో OTT లోకి ఫ్యామిలీ స్టార్ .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

  • Published Jun 26, 2024 | 10:56 AMUpdated Jun 26, 2024 | 10:56 AM

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ.. థియేటర్ లో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా కూడా.. ఓటీటీ లో మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా మరో భాషలోకి రానునందట.. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ.. థియేటర్ లో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా కూడా.. ఓటీటీ లో మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా మరో భాషలోకి రానునందట.. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Jun 26, 2024 | 10:56 AMUpdated Jun 26, 2024 | 10:56 AM
Family Star In Another OTT: మరో భాషలో మరో OTT లోకి ఫ్యామిలీ స్టార్ .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఇప్పటికే రిలీజ్ అయ్యి చాలా నెలలు గడిచిపోయింది. ఏప్రిల్ 5 న ఈ సినిమా భారీ అంచనాల మధ్యన థియేటర్ లో రిలీజ్ అయింది. అయితే సినిమా రిలీజ్ కు ముందు ఉన్న క్రేజ్ సినిమా రిలీజ్ తర్వాత రాలేదన్న సంగతి తెలిసిందే. కారణాల ఏమై ఉంటాయో తెలియదు కానీ.. ఈ సినిమా థియేటర్ ప్రేక్షకులను మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. దీనితో థియేట్రికల్ రన్ త్వరగా పూర్తి చేసుకుని.. ఏప్రిల్ 26 న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీ లో విడుదలైన కొద్దీ రోజుల్లోనే ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోయింది. అయితే మళ్ళీ ఇన్ని నెలల తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమా టాపిక్ ఎందుకొచ్చిందంటే.. ఇప్పుడు ఈ సినిమా మరో భాషలోకి కూడా రానుందంట.

ఏప్రిల్ 26 నుంచి ది ఫ్యామిలీ స్టార్ సినిమా.. తెలుగుతో పాటు.. తమిళ , కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయినా ఈ సినిమాను దాదాపు ప్రేక్షకులంతా చూసే ఉంటారు. థియేటర్ లో కొన్ని సినిమాలు ఎటువంటి టాక్ సంపాదించుకున్నా కూడా ఓటీటీ లో మాత్రం ఆయా సినిమాలకు మంచి క్రేజ్ వస్తుందని.. ఫ్యామిలీ స్టార్ సినిమా మరొక సారి నిరూపించింది. ఇక ఈ సినిమా అనుకోని విధంగా ఓటీటీ లో హిట్ కావడంతో.. ఇప్పుడు మరొక ఓటీటీ లోకి మరొక భాషలోకి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అదేంటంటే.. ఫ్యామిలీ స్టార్ సినిమా హిందీ వెర్షన్.. జూన్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి హిందీ వెర్షన్ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

The family star

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత.. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ సినిమా విజయ్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచినా కూడా.. విజయ్ కు మాత్రం మంచి పాపులారిటీనే దక్కింది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా హిందీ వెర్షన్ కూడా విజయ్ కు మంచి పాపులారిటీ సంపాదించిపెడుతుందని.. భావిస్తున్నారు అభిమానులు. ఫ్యామిలీ స్టార్ సినిమా సుమారు రూ.50 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు మేకర్స్. ఇక ఈ సినిమా థియేటర్ రిలీజ్ తర్వాత మాత్రం కేవలం రూ.20కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. కానీ ఓటీటీ లో మాత్రం సుమారు మూడు వారాల పాటు.. ఫ్యామిలీ స్టార్ సినిమా టాప్ ట్రెండ్ లో నిలిచింది. ఇక ఇప్పుడు మరో ఓటీటీ లో హిందీ వెర్షన్ కు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి