iDreamPost

తల్లి మరో వివాహం.. సవతి తమ్ముడిపై ప్రేమ.. OTTలో రేర్ మూవీ!

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీలు వచ్చిన తర్వాత చాలా వరకు రేర్ మూవీస్, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చూస్తున్నారు. అలాంటి అభిరుచి కలిగిన వారికోసం ఒక క్రేజీ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. ఈ మూవీలో సవతి తమ్ముడిపై ప్రేమ అనే పాయింట్ పిచ్చెక్కిస్తుంది.

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీలు వచ్చిన తర్వాత చాలా వరకు రేర్ మూవీస్, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చూస్తున్నారు. అలాంటి అభిరుచి కలిగిన వారికోసం ఒక క్రేజీ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. ఈ మూవీలో సవతి తమ్ముడిపై ప్రేమ అనే పాయింట్ పిచ్చెక్కిస్తుంది.

తల్లి మరో వివాహం.. సవతి తమ్ముడిపై ప్రేమ.. OTTలో రేర్ మూవీ!

హాలీవుడ్ సినిమాలు అంటే కాస్త కాదు.. ఎక్కువగానే భిన్నంగా ఉంటాయి. వాళ్లు డ్రామాని రక్తికట్టించడం కోసం కొన్ని కొన్ని సన్నివేశాలు తీస్తూ ఉంటారు. అయితే అక్కడి కల్చర్ కి సెట్ అవుతుంది. కానీ, మన దగ్గర మాత్రం కాస్ ఎబ్బెట్టుగానే ఉంటుంది. కానీ.. యాక్షన్, ఎమోషన్, డ్రామా మాత్రం బాగుంటుంది. అలాంటి ఒక క్రేజీ మూవీని మీకోసం తీసుకొచ్చాం. ఈ సినిమా నిజంగానే అన్ని కోణాల్లో మిమ్మల్ని మెప్పిస్తుంది. అయితే ఇందులో ఉండే ప్రేమ వ్యవహారం మాత్రం కాస్త జుగుబ్సాకరంగా ఉంటుంది. ఆ ఒక్క పార్ట్ గురించి ఇంత మంచి మూవీని లైట్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందుకే ఓటీటీ సజీషన్ గా ఈ యాక్షన్ డ్రామాని మీకోసం తీసుకొచ్చాం.

సాధారణంగా ఓటీటీ వచ్చిన తర్వాత భాషలతో సంబంధం లేకుండా.. జానర్స్ తో సంబంధం లేకుండా అన్నీ సినిమాలు చూస్తున్నారు. అయితే ఎక్కువ మంది కామెడీ, ఎమోషన్ దగ్గరే ఆగిపోతున్నారు. ఇంకొందరు మాత్రం అచ్చంగా యాక్షన్ మూవీస్ చూస్తున్నారు. కానీ, ఈ మూవీ మాత్రం కచ్చితంగా సెపరేట్ గా ఉంటుంది. మీకు బాగా నచ్చుతుంది కూడా. ఈ మూవీలో అసలు కథ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అదేంటంటే.. హీరోయిన్ తల్లి వేరే వివాహం చేసుకుంటుంది. ఆ రెండో భర్తకు ఒక పెద్ద విల్లా ఉంటుంది. అలాగే ఇంతకంటే ముందు ఒక కొడుకు కూడా ఉంటాడు.

My Fault

హీరోయిన్ తన ఊరిని తన ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి ఆ మ్యాన్షన్ కి వెళ్లిపోవాల్సి వస్తుంది. అక్కడ తనకు ఏమీ నచ్చదు. ముఖ్యంగా తన సవతి తమ్ముడు నిక్ అంటే బాగా కోపం. వాళ్లిద్దరు బాగా అరుచుకుంటూనే ఉంటారు. ఫ్యామిలీని అర్థం చేసుకోవడం కోసం.. నిక్ ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తాడు. కానీ, ఆ పార్టీ నుంచి మధ్యలోనే వెళ్లిపోతాడు. నోవా కూడా వెళ్లిపోతాను అంటే నిక్ ని వదలిపెట్టమని చెప్తారు. తీరా చూస్తే నిక్ మరో పార్టీకి వెళ్లాడు. అక్కడే నిక్ ఒక ప్లే బాయ్ అని నోవాకి తెలుస్తుంది. అలాగే అతను ఒక రేసర్ అనే విషయం కూడా తెలుస్తుంది. నోవా తెలియకుండానే ఒక రేస్ కూడా గెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఒక పాయింట్ లో వీరిద్దరు ఒకరికిని ఒకరు ము*ద్దు పెట్టుకుంటారు.

ఆ ము*ద్దు సీన్ నుంచే కథ అడ్డం తిరుగుతుంది. ఇద్దరి మధ్య ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ఫీలింగ్స్ చాలానే మలుపులు తీసుకుంటాయి. అలా సవతి తమ్ముడి మీద ప్రేమను పెంచుకుంటుంది. అసలు వారి ప్రేమ ఎన్ని మలుపులు తిరిగింది? అసలు వారి ప్రేమ సక్సెస్ అయ్యిందా? దానిని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసిందా? అసలు నోవా- నిక్ తర్వాత ఏం చేశారు? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో కథ ముందుకు సాగుంతుంది. అయితే ఈ మూవీలో కాస్త ఘాటు సన్నివేశాలు కూడా ఉంటాయి. ఈ సినిమా పేరు ‘మై ఫాల్ట్‘. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. చూడాలి అనుకుంటే ఒంటరిగా చూస్తే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి