iDreamPost

OTT Movie: భార్యల మీద రెచ్చిపోతున్నారా? వాళ్లు రివర్స్ అయితే ఎలా ఉంటుందో చూడండి!

OTT Suggestions- Best Thriller Movie: మీరు చాలానే థ్రిల్లర్ మూవీస్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక థ్రిల్లర్ ని చూసుండరేమో. ఎందుకంటే ఒక్కో సీన్ కి బుర్ర గిర్రున తిరుగుతుంది. అంతేకాకుండా.. ఒక్కో ట్విస్టుకు కూడా పిచ్చెక్కిపోతారు. ముఖ్యంగా భార్యను బానిసగా చూసే భర్తలు ఒకసారి ఈ మూవీ చూస్తే మీకు మీ లైఫ్ మీద ఒక క్లారిటీ వస్తుంది.

OTT Suggestions- Best Thriller Movie: మీరు చాలానే థ్రిల్లర్ మూవీస్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక థ్రిల్లర్ ని చూసుండరేమో. ఎందుకంటే ఒక్కో సీన్ కి బుర్ర గిర్రున తిరుగుతుంది. అంతేకాకుండా.. ఒక్కో ట్విస్టుకు కూడా పిచ్చెక్కిపోతారు. ముఖ్యంగా భార్యను బానిసగా చూసే భర్తలు ఒకసారి ఈ మూవీ చూస్తే మీకు మీ లైఫ్ మీద ఒక క్లారిటీ వస్తుంది.

OTT Movie: భార్యల మీద రెచ్చిపోతున్నారా? వాళ్లు రివర్స్ అయితే ఎలా ఉంటుందో చూడండి!

ఓటీటీలో మీరు చాలా సినిమాలు చూస్తూ ఉంటారు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం రియాలిటీకి.. రియల్ లైఫ్ లో జరిగే సంఘటనలకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి సినిమాలకు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా అదే విధంగా వస్తూ ఉంటుంది. అలాంటి సినిమాలు థియేటర్లలోనే కాదు.. ఓటీటీల్లో కూడా దుమ్ము దులుపుతూ ఉంటాయి. అలాంటి ఒక సినిమా ఓటీటీలోకి వచ్చి చాలా రోజులు అవుతోంది. కానీ, చాలా తక్కువ మందికి మాత్రమే ఆ మూవీ గురించి తెలుసు. అలాంటి ఒక మూవీని మీకోసం తీసుకొచ్చాం. ఈ సినిమాని చూశాక.. భార్యపై చేయెత్తాలి అంటే కచ్చితంగా వణుకు పుడుతుంది.

సాధరణంగా చాలామంది మగాళ్ల ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే.. భార్య మనల్ని ఏం చేస్తుంది? అనే ధీమాతో ఉంటారు. అందుకే అన్నీ విషయాలు ఆమెకు చెప్పేది ఏంటి? అసలు ఆమెను ఒక మనిషిలా చూడాల్సిన అవసరం ఏంటి అనే కంక్లూజన్ కు వచ్చేస్తారు. అలాగే భార్యను కొట్టినా తప్పేంటి అనే క్రూయల్ థాట్స్ తో ఉండే వాళ్లు మన దౌర్భ్యానికి ఉండనే ఉన్నారు. అలాంటి వాళ్లు కట్టుకున్న భార్య అంటే తమకు ఏదో బాహుబలి సినిమాలో ఉండే కట్టప్పలాంటి కట్టు బానిస అనుకుంటారు. అందుకే ఊరికే చేయి ఎత్తి కొట్టేస్తుంటారు. అయితే అలాంటి మెంటాలిటీ ఉన్న మగాళ్లు అంతా కచ్చితంగా ఒకసారి ఈ మూవీ చూడాల్సిందే. ఎందుకంటే ఇది మీ సేఫ్టీ కోసమే. ఊరికే వారి సహనాన్ని పరీక్షిస్తే మీకే ప్రమాదం మరి.

అలాంటి వాళ్లకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేందుకు ఈ మూవీ బాగా ఉపయోగపడుతుంది. ఈ మూవీలో హీరోయిన్ ఎన్నో కలలు కంటుంది. తన పక్కింటి కుర్రాడిని ఇష్టపడుతుంది. పెద్దలు పెళ్లి కూడా చేస్తారు. అరేంజ్డ్ అయినా కూడా మంచి అబ్బాయినే చేసుకున్నాను అనే భ్రమలో ఉంటుంది. ఆ భ్రమ తొలగిపోవడానికి పెద్ద సమయం పట్టదు. ఊరికే ఆమెతో గొడవకు దిగడం చేస్తూ ఉంటాడు. పైగా ఆ భర్త ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కూడా. అతనికి కొట్టడం, హిసించడం అంటే బాగా ఇష్టం. అందుకే చిన్న కారణానికి కూడా భార్య మీద నోరేసుకు పడటం మాత్రమే కాకుండా.. అకారణంగా కొట్టేస్తాడు. అంతేకాకుండా.. భార్య అంటే బానిస అనే ధోరణి ప్రదర్శిస్తూ ఉంటాడు.

ఇతనితో బాధలు పడలేక ఎంతో ఇబ్బందులు పడుతుంటే.. అటు కన్నవాళ్లు కూడా కొడుతున్నాడు అంటే నువ్వేం తప్పు చేశావ్ అంటారు. తన జీవితం ఏంటో తనకే అర్థంకాని పరిస్థితి. ఆ బాధలు తట్టుకోలేక ఎలాగైనా భర్తకు బుద్ధి చెప్పాలి అని ఫిక్స్ అవుతుంది. అనుకున్నదే తడవుగా భర్తకు ప్రత్యక్షంగా నరకం చూపిస్తుంది. ఆమె ఆ రేంజ్ లో రివేంజ్ తీర్చుకుంటుందని ఎవ్వరూ ఊహించరు. అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ కూడా చిన్న కుందేలును చేసి ఆడిస్తుంది. ఈ మూవీలో సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులకు బుర్ర గిర్రున తిరుగుతుంది. ఈ సినిమా మరేదో కాదు.. అమ్ము. ఇందులో ఐశ్వర్య లక్ష్మీ, నవీన్ చంద్ర, సింహా యాక్టింగ్ ఇరగదీశారు. ఈ అమ్ము మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2022 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఈ మూవీ మీరు ఇప్పటికే చూసుంటే.. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి