iDreamPost

గుర్తు తెలియని మహిళ వరుస హత్యలు.. OTTలో ఓ రేంజ్ పొలిటికల్ డ్రామా!

OTT Suggestions Best Political Drama Series: వెబ్ సిరీస్లు ఇష్టపడే వారికోసం ఒక బెస్ట్ పొలిటికల్ డ్రామా తీసుకొచ్చాం. ఈ సిరీస్ లో అధికారం కోసం వీళ్లు చేసే దారుణాలు చూస్తే మీకు పిచ్చెక్కిపోతుంది.

OTT Suggestions Best Political Drama Series: వెబ్ సిరీస్లు ఇష్టపడే వారికోసం ఒక బెస్ట్ పొలిటికల్ డ్రామా తీసుకొచ్చాం. ఈ సిరీస్ లో అధికారం కోసం వీళ్లు చేసే దారుణాలు చూస్తే మీకు పిచ్చెక్కిపోతుంది.

గుర్తు తెలియని మహిళ వరుస హత్యలు.. OTTలో ఓ రేంజ్ పొలిటికల్ డ్రామా!

ఓటీటీలు వచ్చిన తర్వాత ఆడియన్స్ అంతా వెబ్ సిరీస్లు కూడా చూసేందుకు బాగా అలవాటు పడిపోతున్నారు. చాలా మంది తెలుగులోనే కాకుండా.. మలయాళం, తమిళ్, హాలీవుడ్ అంటూ అన్ని భాషల్లో ఉన్న సిరీస్లను ఓ రౌండ్ ఏస్తున్నారు. అయితే హాలీవుడ్ సిరీస్లో మీకు యాక్షన్ ఉంటుంది గానీ.. కథ, కథనం, ఎమోషన్ లాంటివి చాలా అరుదుగా దొరుకుతాయి. అయితే మీకు వీటికి అదనంగా మంచి యాక్షన్ కూడా కలిసి ఉన్న ఒక వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. ఈ సిరీస్ కు మంచి మంచి రివ్యూలు కూడా వచ్చాయి. అయితే తెలుగు కాకపోవడంతో చాలా మంది ఈ సిరీస్ ని లైట్ తీసుకున్నారు. కానీ, ఇది తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

సాధారణంగా వెబ్ సిరీస్ అనగానే సబ్ టైటిల్స్ పెట్టుకుని చూసేవాళ్లు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వేరే భాషలో ఉండే సిరీస్లు చూడటం వల్ల ఆ కష్టం తప్పదు. కానీ, ఈ సిరీస్ మాత్రం మీకు తెలుగులోనే అందుబాటులో ఉంది. అయితే ఇది తెలుగు సిరీస్ కాదు. ఒక తమిళ్ సిరీస్. కానీ.. కథ, ట్విస్టుల విషయంలో మాత్రం ప్రతి సీన్, ప్రతి ఎపిసోడ్ కి పిచ్చెక్కిపోతారు. ఎందుకంటే సాధారణంగానే పాలిటిక్స్ అనేది అందరికీ కనెక్టింగ్ పాయింట్. అలాంటి పాయింట్ తో వీళ్లు ఒక అద్భుతమైన సిరీస్ ని తీసుకొచ్చారు. అలాగే అధికారం కోసం రెండు పార్టీలు, రెండు వర్గాలు మాత్రమే కాకుండా.. సొంత కుటుంబం కూడా కొట్లాడే నాటకీయ పరిణామాలు ఈ సిరీస్లు మీరు చూడచ్చు.

అంతేకాకుండా ఇందులో మంచి మంచి కాన్ ఫ్లిక్ట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సాధారణంగానే రాజకీయం అంటే దాని చుట్టూ ఎంత డ్రామాని అయినా క్రియేట్ చేయచ్చు. అదే పాయింట్ తో వీళ్లు మంచి కథను తెరకెక్కించారు. ఇంక ఇందులో ఉండే ఒక్కో యాక్టర్ వారి బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఇరగదీశారు. అంతేకాకుండా ఈ సిరీస్ తో ప్రేమిస్తే భరత్ తన సెంకడ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. ఇంక శ్రియా రెడ్డి, కుని కుశృతి, ఆదిత్య, కిషోర్, రెమ్యా నంబీషన్ ఇలా చాలా మందే ఈ సిరీస్ స్టార్ కాస్ట్ ఉంది.

అధికారం వీళ్లు చేసే రాజకీయాలు, ప్రతిపక్షం- అధికార పక్షం మధ్య జరిగే పోరాటాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఒక కేసు రిజల్ట్ మీద ఒక పార్టీ 50 ఏళ్ల చరిత్ర ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ పార్టీ మనుగడ కూడా ఉంటుంది. అంత క్లిష్టమైన పాయింట్లు చాలానే ఉంటాయి. మొత్తానికి ఈ సిరీస్ చూస్తే మాత్రం మంచి పొలిటికల్ డ్రామా చూశామే అనే ఫీల్ అయితే వస్తుంది. ఈ సిరీస్ పేరు ‘తాలాయిమయి సేయలగం‘. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి