iDreamPost

లక్షపెట్టుబడి పెడితే 40 రోజుల పాటు రూ.10 వేలు! IT ఉద్యోగులే టార్గెట్!

మనిషికి డబ్బుపై ఉంటే అత్యాశే.. ఇబ్బందులను కొని తెస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు పొందాలనే ఆతృతలో అసలుకే ఎసరు పెట్టుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. విద్యావంతులు సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో అలాంటి భారీ సైబర్ మోసం బయటపడింది.

మనిషికి డబ్బుపై ఉంటే అత్యాశే.. ఇబ్బందులను కొని తెస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు పొందాలనే ఆతృతలో అసలుకే ఎసరు పెట్టుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. విద్యావంతులు సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో అలాంటి భారీ సైబర్ మోసం బయటపడింది.

లక్షపెట్టుబడి పెడితే 40 రోజుల పాటు రూ.10 వేలు! IT ఉద్యోగులే టార్గెట్!

మనిషికి డబ్బుపై వ్యామోహం ఉండటం అనేది సర్వసాధారణం. ధనం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. చాలా మందికి మాత్రం అత్యాశ ఉంటుంది. ఎక్కువ సంపాదించాలని అత్యాశకు పోతుంటాడు. ఇక మనిషి ఆశను సైబర్ ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇలా సైబర్ కేటుగాళ్లు చేసే మోసాలుకు సంబంధించిన వార్తలు నిత్యం ఎన్నో వస్తున్నా కూడా డబ్బుపై ఉండే ఆశ మనలో చావదు. మనలోని ఆ అవివేకమే సైబర్ నేరస్థులకు పెట్టుబడిగా మారుతోంది. తాజాగా హైదరాబాద్ నగరంలో భారీ మోసం బయట పడింది. ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే రోజువారీగా లాభాలు ఇస్తామంటూ సామాజిక మాధ్యమంలో ప్రకటన చూసి చాలామంది కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

డబ్బుపై అత్యాశ, ఎక్కువ జీతం రావాలనే కోరిక, త్వరగా ఎక్కువ ధనం సంపాదించాలి, నిరుద్యోగిత ఇలా.. వివిధ రకాల బలహీనతలు కలిగిన వారినే టార్గెట్ గా పెట్టుకుని సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఫ్యానిక్ కంపెనీ పేరిట ఓ నకిలీ వెబ్ సైట్ అకౌంట్ ను సైబర్ నేరగాళ్లు తెరిచారు. దాని ద్వారా లక్ష పెట్టుబడి పెడితే 40 రోజుల పాటు రూ.10 వేల చొప్పున లాభాలిస్తామని నమ్మించారు. ఇక సోషల్ మీడియాలో వచ్చిన ఈ ప్రచారాన్ని నమ్మి హైదరాబాద్​కి చెందిన కొందరు ఆ కంపెనీలో లక్షల్లో పెట్టుబడి పెట్టారు. చాలా రోజుల పాటు ఆ అకౌంట్ చాలా యాక్టీవ్ గానే ఉంది.

దీంతో పెట్టుబడులు పెట్టిన వారు ఈ కంపెనీని పూర్తిగా నమ్మారు. అయితే పెట్టుబడులు పెట్టిన వారికి కంపెనీ సడెన్ గా షాక్ ఇచ్చింది. ఈ నెల 26 నుంచి సదరు కంపెనీ వెబ్​సైట్ పనిచేయలేదు. ఆ కంపెనీ ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కాలేదు.. చివరకు తాము మోసపోయామని గమనించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫ్యానిక్ కంపెనీ పేరిట వెబ్​సైట్ ద్వారా తమతో పరిచయం ఏర్పచుకున్నారని బాధితులు వివరించారు. ఆ సైట్ లో వారు చూపించే ప్రొడక్ట్స్​పై పెట్టుబడి పెడితే 4 రెట్లు అధిక లాభాలు వస్తాయని ఆ సైట్ లో నమ్మబలికారని తెలిపారు. నిజమే అని నమ్మి తాము పెట్టుబడులు పెట్టి మోసపోయామని బాధితులు వాపోయారు.

ఇంకా ఈ ఘటన గురించి బాధితులు పలు ఆసక్తికర విషయాలను పోలీసులకు తెలియజేశారు. ఇక వారు చెప్పిన స్కీమ్ లో తాము తొలుత చేరి.. ఆ తరువాత కొత్తవారిని చేరిస్తే..కమీషన్ ఇస్తామని తెలిపారు. అలానే కొత్తవారిని ఈ స్కీమ్ లో చేర్చితే మొదట రూ.500 నుంచి రూ.1000 వరకు కమీషన్ కూడా ఇచ్చారని బాధితులు తెలిపారు. ఇలా గొలుసు పద్దతి ద్వారా సుమారు రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టామని వారు తెలిపారు. తొలుత కొంత మొత్తంలో పెట్టుబడులు చేశామని దానికి లాభాలు ఇచ్చి నమ్మకం కలిగేలా చేశారని బాధితులు పేర్కొన్నారు. వారిని పూర్తిగా నమ్మి.. తామందరం లక్షకు పైగా పెట్టుబడులు పెట్టామన్నారు.

తమను మోసం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మోసపోయిన వారిలో ఎక్కువ మంది విద్యావంతులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నవారు ఉండటం గమన్హారం. ఇలాంటి స్కాములతో ఇప్పటికే చాలా మంది మోసపోయారని, ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మోద్దని పోలీసులు చెబుతున్నారు. అయినే కొందరు ఆ మాటలు చెవికెక్కించుకోకుండా మోసపోతున్నారు. మరి..తాజాగా ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి