iDreamPost
android-app
ios-app

Nitin Gadkari: వాహనదారులకు కేంద్రం భారీ షాక్.. ఇక వెహికిల్స్ షెడ్డుకి పంపాల్సిందే!

  • Published May 31, 2024 | 11:40 AMUpdated May 31, 2024 | 11:40 AM

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇక అలాంటి వాహనాలన్ని షెడ్డుకే పరిమితం కావాల్సి వచ్చే పరిస్థితులు రాబోతున్నాయి అంటున్నారు. ఇంతకు నితిన్‌ గడ్కరీ ఏమన్నారంటే..

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇక అలాంటి వాహనాలన్ని షెడ్డుకే పరిమితం కావాల్సి వచ్చే పరిస్థితులు రాబోతున్నాయి అంటున్నారు. ఇంతకు నితిన్‌ గడ్కరీ ఏమన్నారంటే..

  • Published May 31, 2024 | 11:40 AMUpdated May 31, 2024 | 11:40 AM
Nitin Gadkari: వాహనదారులకు కేంద్రం భారీ షాక్.. ఇక వెహికిల్స్ షెడ్డుకి పంపాల్సిందే!

వాహనాలు, ట్రాఫిక్‌ రూల్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి వాటికి సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేపడతుంది. దీనిలో భాగంగా జూన్‌ 1 నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో తాజాగా వాహనాలకు సంబంధించి కేంద్ర కొత్త రూల్స్‌ అమల్లోకి తేవాలని భావిస్తోంది. వాహనాలకు సంబంధించి.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. కొన్ని నెలల క్రితం బీఎస్‌ 6 ప్రమాణాలతో ఉన్న వాహనాలే నడపాలని ఓ రూల్‌ తెచ్చింది. ఆ తర్వాత ప్రెటోల్లో 20 శాతఖ ఇథనాల్‌ కలపాలని మరో నియమాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో మరో కొత్త రూల్‌ తేవడానికి కేంద్రం ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇది భారతీయ ఆటోమొబైల్‌ రంగాన్ని పూర్తిగా మార్చేయబోతుంది అంటున్నారు. ఇది అమలు అయితే దేశంలో ఉన్న ఆ వాహనాలు షెడ్డుకు వెళ్లాల్సిందే అంటున్నారు. ఆ వివరాలు..

కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తాజాగా చేసిన ప్రకటన ఒకటి దేశంలో సంచలనంగా మారిది. మరో పదేళ్లలోగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ని పూర్తిగా.. రద్దు చేసే ఆలోచనలో ఉందని.. 10 ఏళ్ల వ్యవధిలో దాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది అని తెలిపారు. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం.. రానున్న పదేళ్లలో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను రద్దు చేయాలని భావిస్తోంది అని అర్థం అవుతోంది. ఈ సందర్భంగా నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. సంప్రదాయ వాహనాల కంటే.. ఎలక్ట్రిక్ వాహనాల వల్లే వినియోగదారులకు చాలా తక్కువ ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్, మండీలోని ఓ బహిరంగ సభలో నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2034 నాటికి పెట్రోల్, డీజిల్ వాహనాలకు డోర్లు మూసేయాలనుకుంటోందని చెప్పుకొచ్చారు.

Diesel and Petrol vehicles are closing to 2034

ఈక్రమంలో పీటీఐ ఏజెన్సీ న్యూస్ ప్రకారం.. “కేంద్ర ప్రభుత్వం రానున్న పదేళ్లలో దేశంలో డీజిల్, పెట్రోల్ వాహనాలను రద్దు చెయ్యాలని భావిస్తోంది. ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ స్కూటర్లు, కార్లు, బస్సులు వస్తున్నాయి. మీరు డీజిల్ కోసం రూ.100 ఖర్చు పెడితే.. ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.4 మాత్రమే ఖర్చవుతుంది” అన్నారు గడ్కరీ. ఇక మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈవీల వినియోగాన్ని పెంచేందుకు వాటి మీద సబ్సిడీలు ఇవ్వడం.. ఆఫర్లు ప్రకటించడం వంటివి చేస్తున్నాయి.

అంతేకాక ప్రపంచ దేశాలన్ని.. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు కూడా ఈ దిశగా చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. అందువల్ల ఇండియా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక దేశంలో ఈవీలను ప్రోత్సాహించేందుకు.. కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈవీలపై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తూ.. ఇటీవల కొత్త ఈవీ పాలసీని ఆమోదించింది. ఈ కారణంగా ఈవీల సేల్స్ పెరుగుతాయనే అంచనా ఉంది. 2030 నాటికి ఆటోమొబైల్ రంగంలో.. 30 శాతం వాహనాలు ఎలక్ట్రిక్‌వే అమ్ముడవుతాయనే అంచనా ఉంది.

కానీ కేంద్రం 2034 నాటికి పెట్రోల్, డీజిల్‌ని రద్దు చెయ్యాలనుకుంటే.. ఇప్పటి నుంచే ఈవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. అంటే ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీల సేల్స్, ఈవీలపై డిస్కౌంట్ ఆఫర్ల వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఈవీల సేల్స్ మరింత పెరిగి.. ఉత్పత్తి పెరిగి.. ఉత్పత్తి వ్యయం తగ్గి, అవి మరింత తక్కువ ధరకు లభిస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి