iDreamPost
iDreamPost
బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమాలో కీలకమైన తమ్ముడి పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ని ప్లాన్ చేసినట్టు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి అవకాశం తక్కువగా ఉందని లేటెస్ట్ అప్ డేట్. తన స్థానంలో మాస్ మహారాజా రవితేజ ని ఒప్పించినట్టు వినికిడి. ఇది సింపుల్ గా చెప్పే అఫీషియల్ మ్యాటర్ కాదు కాబట్టి అంతా ఒకే అయ్యాక గ్రాండ్ గా అనౌన్స్ చేస్తారు. ఈ ఇద్దరు గతంలో అన్నయ్యలో కలిసి నటించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ ఎంత పెద్ద హిట్టో ఇప్పటికీ గుర్తే. ఆ టైంలో రవితేజకు స్టార్ ఇమేజ్ రాలేదు. కానీ కెరీర్ పరంగా చాలా హెల్ప్ అయ్యింది.
వ్యక్తిగతంగా చిరుని విపరీతంగా అభిమానించే రవితేజ క్యారెక్టర్ బాగుండి తన ఇమేజ్ కు తగ్గట్టు చూపిస్తే ఎందుకు నో అంటారు. అందులోనూ తను వరస ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు పవర్ రూపంలో సూపర్ హిట్ ఇచ్చింది బాబీనే. ఇది నిజమైతే ఇద్దరు హీరోల అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది. నిజానికి పవన్ అయితే కిక్ ఇంకా ఎక్కువ ఉండేది. మెగా బ్రదర్స్ కాంబినేషన్ ని ఫుల్ లెన్త్ సినిమాలో చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ శంకర్ దాదా జిందాబాద్ లో కొద్దినిమిషాలు మాత్రమే ఆ ముచ్చట తీరింది. కానీ ఇప్పుడూ ఆ ఆశ నీరుగారిపోయిందనే నిరాశ ఉండటం సహజం.
ఇది పక్కనపెడితే చిరు రవితేజ ఇద్దరూ కేవలం వారం గ్యాప్ లో 2022 ఫిబ్రవరిలో తలపడనున్నారు. 4న ఆచార్య రిలీజ్ ఉండగా 11న ఖిలాడీ థియేటర్లలో అడుగు పెడతాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత తక్కువ స్పేస్ లో పెద్ద చిత్రాలు పోటీ పడటం ఎంత వరకు సేఫ్ అనేది చెప్పలేం. ఆచార్యను కొంచెం ముందుకు తెచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది కానీ డేట్ల మీద ఎవరూ ఖచ్చితంగా మాట మీద నిలబడతారని గ్యారెంటీగా చెప్పలేం. ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి. ఉన్నట్టుండి విడుదల తేదీలను మార్చుకుంటున్నారు. ఏదైతేనేం ఇన్నేళ్ల తర్వాత చిరు రవిలను కలిసి చూసే ఛాన్స్ రావడం విశేషమే
Also Read : Jai Bhim : అరుదైన ఘనత దక్కించుకున్న జైభీమ్