iDreamPost

బ్రేకింగ్: బలపడుతున్న రెమాల్ తుఫాన్! రానున్న 2 రోజులు అక్కడ భారీ వర్షాలు!

Cyclone Remal బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి.. తీవ్ర రూపం దాల్చుతుంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలను తడిపేసిన వానలు ఇప్పుడు ఆ రాష్ట్రాలపై దాడి చేయనున్నాయి.

Cyclone Remal బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి.. తీవ్ర రూపం దాల్చుతుంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలను తడిపేసిన వానలు ఇప్పుడు ఆ రాష్ట్రాలపై దాడి చేయనున్నాయి.

బ్రేకింగ్: బలపడుతున్న రెమాల్ తుఫాన్! రానున్న 2 రోజులు అక్కడ భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి.. తీవ్ర రూపం దాల్చుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ ఏడాదిలో ఇది తొలి తుఫానుగా పేర్కొంటోంది. ఈ తుఫానుకు రెమాల్ గా నామకరణం చేశారు. శనివారం నాటికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను తాకుతుందని భావిస్తున్నారు. ఈ తుఫాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ఖేపుపరా, పశ్చిమ బెంగాల్ క్యానింగ్ నుండి దాదాపు సమాన దూరంలో బంగాళా ఖాతంలో కేంద్రీకృతమై ఉందని చెబుతన్నారు. శనివారం ఉదయం నాటికి తుఫాను వేగంగా బలపడి, ఆదివారం అర్థరాత్రి సమయంలో బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాగా, రెమాల్ తుఫాన్.. శనివారం ఆరో దశ లోక్ సభ ఎన్నికలపై ప్రభావాన్ని చూపునుంది.

మే 26 ఉదయం బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను గంటకు 11-120 కిలోమీటర్ల వేగంతో రెమాల్ తుఫాన్ తాకనుందని, 135 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. మే 27 ఉదయం వరకు అంటే దాదాపు 24 గంటల పాటు తీవ్రత కొనసాగుతుందని, ఆపై ఈ తీవ్రత స్థాయి తగ్గవచ్చునని పేర్కొంది.  బెంగాల్ రాష్ట్రంలో  కోల్ కతా, హౌరా, నదియా, ఝర్‌గ్రామ్, నార్త్ 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, పుర్చా మేదిని పూర్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మే 26న అర్థరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపురా మధ్య బంగ్లాదేశ్‌-పశ్చిమ బెంగాల్ వద్ద తీరాలను తాకుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పశ్చిమ బెంగాల్‌లోని లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.

తమ్లుక్, కంఠి, ఘటల్, ఝర్‌గ్రామ్, మేదినీ పూర్, పరూలియా, బంకురా, బిష్ణుపూర్‌లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ .  ఇక రెమాల్ తుఫాన్ ప్రభావం.. ఈశాన్య రాష్ట్రాల మీద ప్రభావం చూపుతుందని వెల్లడించింది. బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, ఇక్కడ శనివారం లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. దీనిపై తుఫాను ప్రభావం ఉండనుందని పలువురు భావిస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తగిన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం సూచనలు జారీ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి