iDreamPost
android-app
ios-app

Rana Naidu Season2: రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

  • Published Jun 29, 2024 | 12:39 PM Updated Updated Jun 29, 2024 | 12:39 PM

ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు బాగా క్రేజ్ పెరుగుతుంది. దీనితో మొదటి సీజన్స్ కు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి.. వాటికీ కంటిన్యుషన్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు రానా నాయుడు వెబ్ సిరీస్ కు రెండవ సీజన్ రాబోతుంది.

ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు బాగా క్రేజ్ పెరుగుతుంది. దీనితో మొదటి సీజన్స్ కు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి.. వాటికీ కంటిన్యుషన్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు రానా నాయుడు వెబ్ సిరీస్ కు రెండవ సీజన్ రాబోతుంది.

  • Published Jun 29, 2024 | 12:39 PMUpdated Jun 29, 2024 | 12:39 PM
Rana Naidu Season2: రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

వెండి తెరపైన ప్రేక్షకులను మెప్పించిన బడా హీరోలు సైతం… ఓటీటీ లో అలరిస్తున్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో వెంకటేష్, రానా కలిసి ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ రానా నాయుడు. బో*ల్డ్ యాక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యూత్ ను బాగా మెప్పించింది ఈ సిరీస్. ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా లభించడంతో… బాగా హిట్ అయినా వెబ్ సిరీస్ లకు కంటిన్యుషన్ సిరీస్ లను రూపొందిస్తున్నారు మేకర్స్ . ఈ క్రమంలోనే ఇప్పుడు రానా నాయుడు వెబ్ సిరీస్ కు సీజన్ 2 రాబోతుంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది.. అనే విషయాలను చూసేద్దాం.

ప్రస్తుతం రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2 షూటింగ్ తో.. రానా, వెంకటేష్ బిజీ బిజీ గా ఉన్నారని సమాచారం. ఇక ఇప్పటికే దాదాపు సిరీస్ షూటింగ్ పూర్తయిందట. ఇంకొక రెండు నెలల్లో అంటే సెప్టెంబర్ లో రానా నాయుడు సీజన్ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ పైన అధికారిక ప్రకటన వెలువడనుంది. కాబట్టి ఈ వెబ్ సిరీస్ కోసం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి సీజన్ లో బో*ల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో.. ఈ సిరీస్ పై విమర్శలు వచ్చాయి. కానీ యూత్ నుంచి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి. ఇక ఇప్పటివరకు ఈ సిరీస్ మొదటి సీజన్ ను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం.. వెంటనే చూసేయండి.

Rana Naidu

రానా నాయుడు కథ విషయానికొస్తే.. ముంబైలోని సెలెబ్రెటీలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే.. దానిని రానానే పరిష్కారిస్తూ ఉంటాడు. అతనికి తేజ్ , జఫ్ఫా నాయుడు అనే ఇద్దరు తమ్ముళ్లు ఉంటారు. అయితే వీరిద్దరి లైఫ్ స్టైల్ కూడా రానా లైఫ్ స్టైల్ కు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక రానా తండ్రి వెంకటేష్.. పదిహేనేళ్ళు జైలు శిక్షను అనుభవించి విడుదలవుతాడు. రానాకు తన తండ్రి అంటే అసలు ఇష్టం ఉండదు. అతనిని ప్రతిక్షణం ద్వేషిస్తూనే ఉంటాడు. ఆఖరికి నాన్న అని పిలవడానికి కూడా ఇష్టపడడు. అసలు దాని వెనుక ఉన్న కథ ఏంటి ! వెంకటేష్ ఎందుకు జైలు కు వెళ్తాడు ! తండ్రి కొడుకుల మధ్య ఎవరు గెలుస్తారు ! సూర్య అనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టార్ కు రానా కు సంబంధం ఏంటి ! అతని వలన రానకు ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి ! అనేదే ఈ సిరీస్ కథ. ఇక రెండవ సీజన్ లో ఇంకాస్త సస్పెన్స్, కొత్త చాలెంజెస్ ఉండబోతున్నాయి. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomCasibomcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş