iDreamPost
android-app
ios-app

భారీ వర్షాల నేపథ్యంలో.. వాహనదారులకు కీలక సూచన!

  • Published Jun 10, 2024 | 2:46 PM Updated Updated Jun 10, 2024 | 2:46 PM

Road Safety Tips: ఎంత ఎండవేడికైనా తట్టుకోవచ్చు కానీ.. వర్షం పడితే ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే అంటారు. వర్షాలు పడితే వాతావరణం చల్లబడుతుంది.. కానీ దాంతోపాటు ప్రమాదాలు కూడా అనేకం పొంచి ఉంటాయి.

Road Safety Tips: ఎంత ఎండవేడికైనా తట్టుకోవచ్చు కానీ.. వర్షం పడితే ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే అంటారు. వర్షాలు పడితే వాతావరణం చల్లబడుతుంది.. కానీ దాంతోపాటు ప్రమాదాలు కూడా అనేకం పొంచి ఉంటాయి.

భారీ వర్షాల నేపథ్యంలో.. వాహనదారులకు కీలక సూచన!

ఈ ఏడాది మార్చి నెల నుంచి ఎండలు దంచికొట్టాయి.. ఏప్రిల్ నెలలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 40 డిగ్రీల నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వేసవి తాపం తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. మే చివరి వారం నుంచి వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పటడంతో వాతావరణం చల్లబడిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి.. ఈ క్రమంలోనే వాహనదారులకు తగు జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి.. దీంతో పలు ప్రాంతాల్లో నీటి మట్టం పెరిగిపోయింది. చెరువులు, కుంటలు నిండిపోయాయి. వర్షాల పడుతున్న సమయంలో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడటం వల్ల కొన్ని చోట్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.  ఈ క్రమంలోనే వాహనదారులకు రాష్ట్ర డీజీపీ రవిగుప్త కీలక సూచనలు చేశారు. వర్షాలు పడినపుడు మ్యాన్ హూల్స్ తెరవొద్దని.. సంబంధితన కార్మికులు మాత్రమే మ్యాన్ హూల్ తెరిచి మూసివేస్తారని పేర్కొన్నారు. అలాగే కొన్ని సూచనలు ఇచ్చారు.

  • వర్షం కురుస్తున్నపుడు పరిమిత వేగంతో వాహనాలు నడపాలి.. అతి వేగం అన్ని సమయాల్లో మంచిది కాదు. స్కిడ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
  • వాహనాల టైర్లు గ్రిప్, థ్రేడ్స్ ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు మెకానిక్స్ తో చెక్ చేయించుకోవాలి. టైర్ల గ్రిప్ సరిగా లేకుంటే వెంటనే మార్చుకోవడం మంచిది.
  • మీ వాహన ఇంజన్ కండీషన్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.. బ్రేక్ పాడ్స్, విండ్ స్క్రీన్ వైపర్ల కండీషన్ చెక్ చేసుకోయించుకోవాలి.
  • మీ వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
  • సాధ్యమైనంత వరకు చిన్నపాటి మెడికల్ కిట్ ఉంచుకుంటే మంచిది.
  • అత్యవసర సమయాల్లో డైల్ 100 కి కాల్ చేసేలా మీ మొబైల్ / మీ వాహనంలో స్పీడ్ డయల్ ఏర్పాలు చేసుకుంటే మంచిది
  •  రోడ్డు పై వాహనాలు నడిపే సమయంలో కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు ఉండవు.