iDreamPost

వరల్డ్‌ కప్‌ గెలవాలి.. ద్రవిడ్‌, కోహ్లీ కోసం కాదు! ఆ ఒక్కడి కోసం గెలిచి తీరాలి!

టీ20 వరల్డ్ కప్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కోసం గెలవడం కాదు. ఆ ఒక్కడి కోసమే వరల్డ్ కప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆ ఒక్కడు ఎవరు? ఎందుకోసం గెలవాలి? తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కోసం గెలవడం కాదు. ఆ ఒక్కడి కోసమే వరల్డ్ కప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆ ఒక్కడు ఎవరు? ఎందుకోసం గెలవాలి? తెలుసుకుందాం పదండి.

వరల్డ్‌ కప్‌ గెలవాలి.. ద్రవిడ్‌, కోహ్లీ కోసం కాదు! ఆ ఒక్కడి కోసం గెలిచి తీరాలి!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కోసం టీమిండియా 2011 వరల్డ్ కప్ గెలిచింది. దాంతో సచిన్ కు ఘనంగా వీడ్కోలు పలికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ భారత్ వరల్డ్ కప్ గెలవలేదు. 2023 ప్రపంచ కప్ ద్వారా టైటిల్ గెలిచే అవకాశం వచ్చినా.. ఫైనల్లో ఆసీస్ పై ఓడిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి భారత్ వరల్డ్ కప్ గెలిచే అవకాశం వచ్చింది. అయితే ఈ పొట్టి ప్రపంచ కప్ ను గెలిచి.. రాహుల్ ద్రవిడ్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియాకు సూచించిన విషయం తెలిసిందే. అయితే ఫ్యాన్స్ మాత్రం ద్రవిడ్ కోసం, విరాట్ కోహ్లీ కోసం కాదు.. వరల్డ్ కప్ అతడి కోసం గెలవాలని కోరుకుంటున్నారు. మరి ఆ ఒక్కడు ఎవరు? ఎందుకోసం గెలవాలి?

టీ20 వరల్డ్ కప్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ కోసం గెలవాలని, గెలిచి వారికి బహుమతిగా ఇవ్వాలని టీమిండియా ప్రముఖులతో పాటుగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం వరల్డ్ కప్ ను గెలిచి ద్రవిడ్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని ఆటగాళ్లను రిక్వెస్ట్ చేశాడు. అయితే వీరిద్దరి కోసం కాదు.. వరల్డ్ కప్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కోసం గెలవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. వారు అలా అనడానికి కారణం ఏంటి? ఓసారి పరిశీలిద్దాం.

రన్ మెషిన్ విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న రోహిత్ శర్మ.. తన మార్క్ కెప్టెన్సీతో జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు. తన సారథ్యంలో ఎన్నో సిరీస్ లను చేజిక్కించుకున్న రోహిత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, 2023 వరల్డ్ కప్ టైటిళ్లను కొద్దిలో చేజార్చుకున్నాడు. మరీ ముఖ్యంగా 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడంతో.. రోహిత్ ఎంతో కుంగిపోయాడు. 2023 వరల్డ్ కప్ లో కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గా అద్భుతంగా రాణించాడు రోహిత్. ఆటగాళ్లలో స్పూర్తిని నింపుతూ ఫైనల్ వరకూ టీమ్ ను తీసుకెళ్లడంలో అతడి పాత్ర అమోఘం. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది టీమిండియా. ఆ బాధ నుంచి తేరుకోవడానికి రోహిత్ కు చాలా రోజులే పట్టింది.

ఇదిలా ఉండగా.. ఇది చాలదు అన్నట్లుగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంతో.. ఆ బాధ మరింత ఎక్కువైంది. దీంతో పాటుగా ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై దారుణంగా విఫలం కావడంతో రోహిత్ పై మరింత ఒత్తిడిని పెంచాయి. ఇన్ని సమస్యల మధ్య టీ20 వరల్డ్ కప్ సారథ్య బాధ్యతలను అతడు ఎలా నిర్వహిస్తాడని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు. కానీ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఈ వరల్డ్ కప్ లో తన అద్భుతమైన కెప్టెన్సీతో జట్టును ఫైనల్ కు చేర్చాడు.

ఇక్కడ హిట్ మ్యాన్ గురించి మరో గొప్ప విషయం చెప్పుకోవాలి. ఏడాది లోపే టీమిండియాను మూడు ఐసీసీ మేజర్ టోర్నీల్లో ఫైనల్స్ కు చేర్చాడు. 2023 డబ్ల్యూటీసీ, వరల్డ్ కప్ 2023లో భారత్ ను ఫైనల్స్ కు చేర్చాడు. కానీ చివరి మెట్టుపై బోల్తాపడి టైటిల్స్ ను అందుకోలేకపోయాడు. కానీ ఈసారి ఎలాగైనా జట్టు మెుత్తం కలిసి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలిచి.. రోహిత్ శర్మకు బహుమతిగా ఇవ్వాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇది మనం అతడికిచ్చే గౌరవంగా భావించాలని వారు పేర్కొంటున్నారు. మరి టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన రోహిత్ శర్మ కోసం వరల్డ్ కప్ గెలావాలి అంటున్న క్రికెట్ అభిమానుల వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి