SNP
BCCI, Bangladesh, New Zealand, England: ఈ ఏడాది ఇండియాలో పర్యటించే జట్లతో టీమిండియా ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. అందులో హైదరాబాద్‌లో కూడా ఒక మ్యాచ్ ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
BCCI, Bangladesh, New Zealand, England: ఈ ఏడాది ఇండియాలో పర్యటించే జట్లతో టీమిండియా ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. అందులో హైదరాబాద్‌లో కూడా ఒక మ్యాచ్ ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ప్రస్తుతం టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024తో ఫుల్ బిజీగా ఉంది. గురువారం సూపర్ 8లో ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ ఆడనుంది. ఒక వైపు వరల్డ్ కప్ టోర్నీ నడుస్తుండగానే.. ఓ మూడు దేశాలతో జరిగే 5 సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో కలిసి మొత్తం ఐదు సిరీస్‌లు ఆడనుంది. తొలుత బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల, మూడు టీ20ల సిరీస్, తర్వాత న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్, ఆపై ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్‌లకు సంబంధించిన తేదీలో, వేదికలు ఇలా అన్ని వివరాలను ప్రకటించిన బీసీసీఐ. అవి ఒకసారి చూద్దాం..
బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 1 వరకు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు చెన్నై వేదికగా జరగనుంది. రెండో టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు కాన్పూర్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత అక్టబర్ 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు ఆడుతుంది. తొలి వన్డే ధర్మశాలలో, రెండో వన్డే ఢిల్లీలో, మూడో వన్డే మన హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. బంగ్లాదేశ్ తర్వాత.. న్యూజిలాండ్ భారత పర్యటనకు రానుంది. అక్టోబర్ 16 నంఉచి నవంబర్ 5 వరకు పర్యటించనుంది. బెంగళూరు వేదికగా అక్టోబర్ 16 నుంచి 20 వరకు తొలి టెస్టు, పూణె వేదికగా అక్టోబర్ 24 నుంచి 28 వరకు రెండో టెస్టు, ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి 5 వరకు మూడో టెస్ట్ జరగనుంది.
బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లు ముగిసిన తర్వాత.. ఇంగ్లండ్ భారత పర్యటనకు రానుంది. 25 జనవరి 2025 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌లు జరుగుతాయి. జనవరి 22న చెన్నై వేదికగా తొలి టీ20, 25న కోల్‌కత్తా వేదికగా రెండో టీ20, జనవరి 28న రాజ్‌కోట్ వేదికగా మూడో టీ20, 31న పూణె వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న ముంబై వేదికగా చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. అలాగే నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే, కటక్ వేదికగా ఫిబ్రవరి 9న రెండో వన్డే, అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 12న మూడో వన్డే జరగనుంది. దీంతో.. ఈ ఏడాది ద్వితీయార్థంలో టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉంది. మరి ఈ షడ్యూల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🥁 Announced!
The International Home Season 2024-25 Fixtures are here! 🙌
Which contest are you looking forward to the most 🤔#TeamIndia | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) June 20, 2024