iDreamPost
android-app
ios-app

వేల కోట్ల పనులు నామినేషన్ పద్దతిలో ఇచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు టెండర్లు పిలవాలంట !!!

  • Published Apr 24, 2020 | 5:15 AM Updated Updated Apr 24, 2020 | 5:15 AM
వేల కోట్ల పనులు  నామినేషన్ పద్దతిలో ఇచ్చిన చంద్రబాబుకు  ఇప్పుడు టెండర్లు పిలవాలంట !!!

కరోనా వైరస్ కు సంబంధించి ర్యాపిడ్ యాక్షన్ టెస్టు కిట్ల కొనుగోలు విషయంలో చంద్రబాబునాయుడు అర్ధంలేని ఆరోపణలన్నింటినీ చేస్తున్నాడు. కిట్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం టెండర్లు ఎందుకు పిలవలేదని అడగటమే చంద్రబాబు మానసికస్ధాయి ఏంటో చెబుతోంది. మొన్నటి వరకూ వైరస్ నిర్ధారిత పరీక్షలు కూడా సరిగా చేయటం లేదని చంద్రబాబు అండ్ కో నానా యాగీ చేశారు. ఇపుడేమో కిట్ల కొనుగోలు చేసి పరీక్షలు చేయిస్తుంటే అవినీతి జరిగిందని, టెండర్లు ఎందుకు పిలవలేదని పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకనే పదిమాసాల పాలనలో ప్రభుత్వంలో పలానా చోట అవినీతి జరిగిందని ఎవరూ ఆరోపణలు చూడా చేయలేకపోతున్నారు. ఇపుడు కూడా అత్యవసరం కాబట్టి టెండర్లు పిలవకుండానే కిట్లు కొనేశారు. దాంతో కొట్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిపోయిందంటూ గోల చేసేస్తున్నాడు చంద్రబాబు.

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బయటకు చెప్పని విషయం ఏమిటంటే కేంద్రం, కర్నాటక ప్రభుత్వాలు కూడా ఐసిఎంఆర్ సూచించిన ఏజెన్సీల నుండే కొనుగోలు చేశాయి. అది కూడా టెండర్లు పిలవకుండానే కొనేశాయి. ఇక చత్తీస్ ఘడ్ అంటారా పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన కిట్లు ఇప్పటికీ పూర్తిగా సరఫరా కాలేదు. పైగా వాటి పనితీరుపై ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఈ విషయాలు చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా కేవలం జగన్ ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడంటే మోడిపై ఆరోపణలు చేస్తే ఏమవుతుందో బాగా తెలుసు. వైరస్ పరీక్షల కోసం కిట్లనే కొనుగోలు చేయని కేసియార్ గురించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు.

ఒకసారి చరిత్రలోకి తొంగిచూస్తే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటిఎం లాగ వాడుకుంటున్నాడంటూ స్వయంగా ప్రధానమంత్రే బహిరంగసభలో ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ట్రాన్స్ ట్రాయ్ వల్ల పనులు కావటం లేదని చెప్పి సుమారు 3 వేల కోట్ల రూపాయల పనులను నవయుగ కంపెనీకి కట్టబెట్టాడు ఇదే చంద్రబాబు. ఎలా కట్టబెట్టాడయ్యా అంటే అత్యవసరాన్ని దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించి నవయుగ కంపెనీకి పనులు అప్పగించినట్లు అప్పట్లో తన చర్యలను సమర్ధించుకున్నాడు.

చంద్రబాబేమో వేల కోట్ల రూపాయల పనులను టెండర్లు పిలవకుండానే పనులు అప్పగించేస్తే తప్పులేదు, అవినీతి జరగలేదు.

అదే 14 కోట్ల రూపాయల కిట్ల కొనుగోలులో మాత్రం భారీ అవినీతి జరిగిందని ఒకటే గోల చేస్తున్నాడు. నాసిరకం నిర్మాణాలైన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి మొదట పిలిచిన టెండర్ వ్యాల్యూ ఎంత ? పనులు పూర్తయ్యేనాటికి ఎన్నిసార్లు వాటి అంచనాలను పెంచాడు ? మొత్తం ఐదేళ్ళ పాలనా కాలంలో అవినీతిని ఆకాశమంతగా పెంచేసిన చంద్రబాబు కూడా కిట్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.