Swetha
2025 బాక్స్ ఆఫీస్ కు ఎండ్ కార్డ్ పడే సమయం వచ్చేసింది. ఎండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని టాలీవుడ్ ప్లాన్ చేస్తుంది. పెద్ద సినిమాలైతే ఏమి లేవు కానీ.. చిన్నవైనా కంటెంట్ ఉన్న సినిమాలైతే ఈ వారం బాగానే రిలీజ్ కానున్నాయి. అన్ని రకరకాల జోనర్స్ ఏ క్రిస్మస్ సెలవలు , న్యూ ఇయర్ ఎండ్, పెద్ద సినిమాలు ఏమి లేవు ... ఇలా అన్నీ చిన్న సినిమాలకు బాగా కలిసి వచ్చాయి.

2025 బాక్స్ ఆఫీస్ కు ఎండ్ కార్డ్ పడే సమయం వచ్చేసింది. ఎండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని టాలీవుడ్ ప్లాన్ చేస్తుంది. పెద్ద సినిమాలైతే ఏమి లేవు కానీ.. చిన్నవైనా కంటెంట్ ఉన్న సినిమాలైతే ఈ వారం బాగానే రిలీజ్ కానున్నాయి. అన్ని రకరకాల జోనర్స్ ఏ క్రిస్మస్ సెలవలు , న్యూ ఇయర్ ఎండ్, పెద్ద సినిమాలు ఏమి లేవు … ఇలా అన్నీ చిన్న సినిమాలకు బాగా కలిసి వచ్చాయి. ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఛాంపియన్, శంబాల, ఈషా, దండోరా, వృషభ లాంటి సినిమాలు రానున్నాయి. పైగా అన్నీ డిఫరెంట్ జోనర్స్ ఏ. అన్నిటికి మీద పాజిటివ్ బజ్ ఏ ఉంది.
శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఛాంపియన్.. ఈ సినిమా అంతా కూడా తెలంగాణలో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించారని అంటున్నారు. ఈ సినిమాకు స్వప్న దత్ , ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు అన్నీ బాగానే ఆకట్టుకున్నాయి. ప్రమోషన్స్ కూడా మంచి జోష్ లో నడుస్తున్నాయి. అలాగే అటు సాయి కుమార్ తనయుడు ఆది శంబాలా మూవీ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఆదికి ఇది రీ ఎంట్రీ అవుతుందని దర్శకులు బలంగా నమ్ముతున్నారు.
ఇక ఈషా అనే హర్రర్ సినిమా ఉంది.. ఈ సినిమాకు బన్నీ వాస్ , వంశి నందపాటి నిర్మాతలుగా వ్యవహరించారు. వీళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా బాగానే ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా బజ్ బాగానే వినిపిస్తుంది. సో హర్రర్ మూవీ లవర్స్ కు ఇదే బెస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. అలాగే శివాజీ నటించిన దండోరా సినిమాకు కూడా ప్రమోషన్స్ బాగానే జరిగాయి. ఇక మలయాళం హీరో మోహనలాల్ వృషభ సినిమా.. చారిత్రక నేపధ్యాల చుట్టూ తిరుగుతుంది. ఇలా ఆఖరి శుక్రవారం కంటెంట్ ఉన్నా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. వీటిలో ఏ రెండు హిట్స్ పడినా టాలీవుడ్ 2025 బాక్స్ ఆఫీస్ ఘనంగా ముగిసినట్టే. ఇక ఏమౌతుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.