iDreamPost
android-app
ios-app

వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’ ప్రారంభం

  • Published Dec 23, 2025 | 5:10 PM Updated Updated Dec 23, 2025 | 5:10 PM

టాలీవుడ్‌లో నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ, వారికి సరైన మార్గదర్శకత్వం వహిస్తున్న ప్రముఖ సంస్థ 'వినోద్ ఫిల్మ్ అకాడమీ' 6వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా 2025, డిసెంబరు 21న రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో వేడుకలు నిర్వహించారు.

టాలీవుడ్‌లో నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ, వారికి సరైన మార్గదర్శకత్వం వహిస్తున్న ప్రముఖ సంస్థ 'వినోద్ ఫిల్మ్ అకాడమీ' 6వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా 2025, డిసెంబరు 21న రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో వేడుకలు నిర్వహించారు.

  • Published Dec 23, 2025 | 5:10 PMUpdated Dec 23, 2025 | 5:10 PM
వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’ ప్రారంభం

టాలీవుడ్‌లో నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ, వారికి సరైన మార్గదర్శకత్వం వహిస్తున్న ప్రముఖ సంస్థ ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ’ 6వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా 2025, డిసెంబరు 21న రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో వేడుకలు నిర్వహించారు. అలాగే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ ‘వినోద్ ఫిలిం అకాడమీ అండ్ స్టూడియోస్’ సంస్థపై కొత్త చిత్రాన్ని కూడా ప్రారంభించారు.వినోద్ కుమార్ నువ్వుల కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, తన విద్యార్థులకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ‘వినోద్ ఫిలిం అకాడమీ అండ్ స్టూడియోస్’ బ్యానర్‌ను ప్రారంభించారు.

తొలి చిత్రాన్ని ప్రొడక్షన్ నెంబర్ 1 గా అనౌన్స్ చేశారు. యువ దర్శకుడు తల్లాడ సాయికృష్ణ దర్శకత్వ పర్యవేక్షణలో, ప్రణయ్‌రాజ్ వంగరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సీనియర్ నటులు ఎల్బీ శ్రీరామ్ క్లాప్ కొట్టగా దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక రాజశేఖర్ ఆనింగి,డాక్టర్ సుధాకర్, ప్రొఫెసర్ విల్సన్, నటులు &VFA ప్రిన్సిపల్ కిషోర్ దాస్,VFA HOD బబ్లూ, జబర్ధస్త్ జీవన్, సినీ-టీవి నటి అమ్మినేని స్వప్న చౌదరి,జయం సీరియల్ నటి, పృథ్వీ, VFA Team ఉష శ్రీ, విజయ్ భరత్, విజయ్ గుర్రపు, మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ నటులు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ..”పరిశ్రమలోకి వేలమంది వస్తుంటారు, కానీ సరైన శిక్షణ లేక వెనకబడిపోతుంటారు. వినోద్ కుమార్ నువ్వుల తన అనుభవాన్నంతా రంగరించి విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయం. నటుడిగా ఆయనకు ఉన్న క్రమశిక్షణే ఈ అకాడమీ విజయరహస్యం. కొత్తగా ప్రారంభించిన సినిమా మరియు ‘వినోదం’ పత్రిక ద్వారా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా కి నిర్మాత & హీరో – వినోద్ కుమార్ నువ్వుల, డైరెక్టర్ – ప్రణయ్ రాజ్ వంగరి, కేమెరా – నిక్షయ్ శెట్టి, సంగీతం – లలిత్ కిరణ్, బ్యానర్ – వినోద్ ఫిల్మ్ అకాడమీ & స్టూడియోస్.