iDreamPost
android-app
ios-app

వారణాసి వెయ్యి కోట్లకు మించిన బడ్జెట్ అట..

  • Published Dec 22, 2025 | 10:48 AM Updated Updated Dec 22, 2025 | 10:48 AM

ఏదైనా సినిమా రిలీజ్ కు రెడీగా ఉందంటే.. దానికంటే ముందు ఆ సినిమా పాన్ ఇండియానా కాదా , ఆ సినిమా బడ్జెట్ ఎంత , ఎన్ని కోట్లు అనే డిస్కషన్స్ ఏ ఎక్కువైపోయాయి. ఎంటర్టైన్మెంట్ కంటే ముందు బడ్జెట్ మ్యాటర్ అయిపోయింది. అందులోను రాజమౌళి లాంటి బడా డైరెక్టర్స్ అయితే ఇక అది కొన్ని కోట్లలో ఉంటుందని అంతా ముందే ఫిక్స్ అయిపోతున్నారు.

  • Published Dec 22, 2025 | 10:48 AMUpdated Dec 22, 2025 | 10:48 AM
వారణాసి వెయ్యి కోట్లకు మించిన బడ్జెట్ అట..

ఏదైనా సినిమా రిలీజ్ కు రెడీగా ఉందంటే.. దానికంటే ముందు ఆ సినిమా పాన్ ఇండియానా కాదా , ఆ సినిమా బడ్జెట్ ఎంత , ఎన్ని కోట్లు అనే డిస్కషన్స్ ఏ ఎక్కువైపోయాయి. ఎంటర్టైన్మెంట్ కంటే ముందు బడ్జెట్ మ్యాటర్ అయిపోయింది. అందులోను రాజమౌళి లాంటి బడా డైరెక్టర్స్ అయితే ఇక అది కొన్ని కోట్లలో ఉంటుందని అంతా ముందే ఫిక్స్ అయిపోతున్నారు. ఇక రీసెంట్ గా ఇప్పుడు సెట్స్ మీద ఉన్న అల్లు అర్జున్ , అట్లీ సినిమా సుమారు రూ.800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందనే టాక్ వచ్చింది.

ఇదిలా ఉండగా మరోవైపు రామాయణంకు రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు నిర్మాత ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఇలా ఉంటె ఇప్పుడు వారణాసి బడ్జెట్ హైలెట్ అవుతుంది. ఈ సినిమాకు సుమారు ఓ వెయ్యి కోట్లు ఖర్చు చేస్తారని అంతా అనుకున్నారు. కానీ రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు వెయ్యి కోట్లకు మించి ఖర్చు చేస్తున్నారట. ఆ విషయాన్నీ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ప్రియాంక చోప్రా కన్ఫర్మ్ చేసింది.

తాజాగా ప్రియాంక చోప్రా కపిల్ శర్మ షోకి అటెండ్ అయింది. ఈ సంధర్బంగా కపిల్ శర్మ మాటల్లో మాటగా వారణాసి బడ్జెట్ 1300 కోట్లట కదా అని అడిగితే ఆమె అవును అని సమాధానం ఇచ్చింది. దీనితో ఇప్పుడు ఈ బడ్జెట్ లెక్కలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొత్తానికి వారణాసి బడ్జెట్ అయితే బయటకు వచ్చింది. అక్కడ ఉన్నది రాజమౌళి కాబట్టి ఖచ్చితంగా ఆ బడ్జెట్ కు న్యాయం అయితే జరుగుతుంది . ఇక ముందు ముందు ఏమౌతుందో, సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి . మరి ఈ అప్డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.