iDreamPost
android-app
ios-app

ఛాలెంజ్ లో విన్ అయితే రోషన్ లైన్ లో పడినట్టే

  • Published Dec 23, 2025 | 12:01 PM Updated Updated Dec 23, 2025 | 12:01 PM

శ్రీకాంత్ కొడుకు రోషన్ టీన్స్ లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నిర్మల కాన్వెంట్ అనే ఓ చిన్న సినిమాతో పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత బాగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రాఘవేంద్రరావు డైరెక్షన్ లో పెళ్ళిసందడిలో నటించాడు. ఆ సినిమాకు మిక్సడ్ టాక్ వచ్చింది.

  • Published Dec 23, 2025 | 12:01 PMUpdated Dec 23, 2025 | 12:01 PM
ఛాలెంజ్ లో విన్ అయితే రోషన్ లైన్ లో పడినట్టే

శ్రీకాంత్ కొడుకు రోషన్ టీన్స్ లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నిర్మల కాన్వెంట్ అనే ఓ చిన్న సినిమాతో పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత బాగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రాఘవేంద్రరావు డైరెక్షన్ లో పెళ్ళిసందడిలో నటించాడు. ఆ సినిమాకు మిక్సడ్ టాక్ వచ్చింది. మరీ అంత కాదు కానీ పరవాలేదనిపించుకుంది. ఆ తర్వాత శ్రీలీలకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు తీసింది.

కానీ రోషన్ మాత్రం కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఛాంపియన్ తో ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు స్వప్న సినిమా సంస్థ ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ పెట్టింది. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన కథ ఇది. ఇప్పుడు ఇలాంటి కథలకు మంచి ఇంపోర్టాన్స్ ఇస్తున్నారు . ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే చూస్తున్నారు. థియేటర్ల నుంచి రూ.30 కోట్ల దాకా షేర్ రావాల్సి ఉంది. అంటే గ్రాస్ రూ.50 కోట్ల దాకా కలెక్ట్ చేయాలి.

రోషన్ కి ఇది చాలా పెద్ద టార్గెట్ అని చెప్పి తీరాల్సిందే. కంటెంట్ బావుంటే మాత్రం ఆటొమ్యాటిక్ గా మౌత్ పబ్లిసిటీ తో అంత సెట్ అయిపోతుంది. అప్పుడే ఈ టార్గెట్ ను రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఛాంపియన్ తో ఈ ఛాలెంజ్ లో విన్ అవుతాడో లేదో చూడాలి. ఒకవేళ విన్ అయితే మాత్రం రోషన్ ట్రాక్ లో పడినట్లే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.