iDreamPost
android-app
ios-app

మాస్ ఎలివేషన్స్ తో రష్మిక మైసా గ్లిమ్ప్స్

  • Published Dec 24, 2025 | 3:30 PM Updated Updated Dec 24, 2025 | 3:30 PM

పుష్ప నుంచి రష్మిక టైమింగ్ చాలా బావుందని.. పట్టిందల్లా కాసుల వర్షమే అని ఇదివరకే చాలా మంది అంటూ ఉన్నారు. అందులో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే ఈ ఏడాది రష్మిక నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు రష్మిక నటిస్తున్న కొత్త సినిమా 'మైసా'. ఈ సినిమాలో రష్మిక ఎవరు ఊహించని గెటప్ లో కనిపించింది.

  • Published Dec 24, 2025 | 3:30 PMUpdated Dec 24, 2025 | 3:30 PM
మాస్ ఎలివేషన్స్ తో రష్మిక మైసా గ్లిమ్ప్స్

పుష్ప నుంచి రష్మిక టైమింగ్ చాలా బావుందని.. పట్టిందల్లా కాసుల వర్షమే అని ఇదివరకే చాలా మంది అంటూ ఉన్నారు. అందులో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే ఈ ఏడాది రష్మిక నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు రష్మిక నటిస్తున్న కొత్త సినిమా ‘మైసా’. ఈ సినిమాలో రష్మిక ఎవరు ఊహించని గెటప్ లో కనిపించింది. న్యూ డైరెక్టర్ రవీంద్ర పుల్లే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి సంబందించిన మొదటి గ్లిమ్ప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ గ్లిమ్ప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో రష్మీక లుక్ చూస్తే అందరు షాక్ అవ్వాల్సిందే. ఒళ్లంతా రక్తం, చేతికి బేడీలు , గన్ పట్టుకుని ఓ గిరిజన యువతిగా ఆమె కనిపిస్తుంది. అలాగే వాయిస్ కూడా చాలా గాంభీర్యంగా ఉంది.. కథ కథనం ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. రష్మిక ఓ సరికొత్త పవర్ ప్యాక్డ్ యాక్షన్ రోల్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోడానికి వస్తుంది అనైతే క్లియర్ గా ఉంది. ఈ సినిమాను అన్ ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈసారి మాస్ ఎలివేషన్స్ తో వస్తున్న రష్మిక ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.