iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ వర్మ అసలు ఏమి ప్లాన్ చేస్తున్నట్లు

  • Published Dec 24, 2025 | 11:02 AM Updated Updated Dec 24, 2025 | 11:02 AM

హనుమాన్ సినిమా వచినప్పుడు ప్రశాంత్ వర్మ పేరు ఓ రేంజ్ లో వినిపించింది. వెంటనే జై హనుమాన్ కూడా వచ్చి ఉంటె ఇప్పుడు ప్రశాంత్ వర్మ రేంజ్ మరోలా ఉండేది. కానీ అది జరగలేదు. సరే పోనీ ఇంకేమైనా సినిమాలు వచ్చాయా అంటే అది కూడా లేదు. ఈ మధ్యలో ప్రశాంత్ వర్మ చేతిలో నుంచి జారిపోయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

  • Published Dec 24, 2025 | 11:02 AMUpdated Dec 24, 2025 | 11:02 AM
ప్రశాంత్ వర్మ అసలు ఏమి ప్లాన్ చేస్తున్నట్లు

హనుమాన్ సినిమా వచినప్పుడు ప్రశాంత్ వర్మ పేరు ఓ రేంజ్ లో వినిపించింది. వెంటనే జై హనుమాన్ కూడా వచ్చి ఉంటె ఇప్పుడు ప్రశాంత్ వర్మ రేంజ్ మరోలా ఉండేది. కానీ అది జరగలేదు. సరే పోనీ ఇంకేమైనా సినిమాలు వచ్చాయా అంటే అది కూడా లేదు. ఈ మధ్యలో ప్రశాంత్ వర్మ చేతిలో నుంచి జారిపోయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. రణ్వీర్ సింగ్ ప్యాన్ ఇండియా మూవీ టెస్ట్ షూట్ వరకు వచ్చి ఆగిపోయింది. కారణాలు ఏమైనా అయ్యి ఉండొచ్చు కానీ ఓ మంచి ప్రాజెక్ట్ మిస్ అయినట్లే.

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ లో లోపమా లేదా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అనేదానిమీద క్లారిటీ లేదు. ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే.. ఆ హీరో మీద ఆ దర్శకుడి మీద అంచనాలు అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. దర్శకులు తమ తర్వాత సినిమాలను నిలబెట్టుకోవడం చాలా అవసరం. అలాగే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఆగిపోవడం కూడా ప్రశాంత్ వర్మకి ఒక రకమైన ఇబ్బంది తెచ్చి పెట్టింది. దానికి బాధ్యుడు తను కాకపోయినా చాలా సమయం వేస్ట్ అయిపోయింది.

రిషబ్ శెట్టితో జై హనుమాన్ త్వరలోనే మొదలవుతుందని అంటున్నారు కానీ ఈ టైం కి ఈ డేట్ కి స్టార్ట్ అవుతుందని చెప్పలేదు. ఇక ఇప్పటికైనా ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో తన డైరెక్షన్ రీస్టార్ట్ చేస్తే ఫార్మ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి . మరోవైపు హీరోలందరూ రెండు మూడేళ్లు డేట్లు ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు కాబట్టి ప్రశాంత్ వర్మ తొందరపడక తప్పదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.