Swetha
విజయ్ దేవరకొండ సినిమా అనగానే అందరికి గుర్తోచేవి రెండు నేచర్స్ . ఒకటి బోల్డ్ అండ్ రగ్గడ్ లుక్ లో ఉండే అర్జున్ రెడ్డి.. ఇంకోటి దానికి చాలా ఆపోజిట్ లో ఉండే గీత గోవిందం లో విజయ్ క్యారెక్టర్. ఈసారి నుంచి మాత్రం అందరికి ఈ రెండిటికంటే ముందు అందరికి రౌడీ జనార్దన్ గుర్తొచ్చేలా ఉన్నాడు . తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు.

విజయ్ దేవరకొండ సినిమా అనగానే అందరికి గుర్తోచేవి రెండు నేచర్స్ . ఒకటి బోల్డ్ అండ్ రగ్గడ్ లుక్ లో ఉండే అర్జున్ రెడ్డి.. ఇంకోటి దానికి చాలా ఆపోజిట్ లో ఉండే గీత గోవిందం లో విజయ్ క్యారెక్టర్. ఈసారి నుంచి మాత్రం అందరికి ఈ రెండిటికంటే ముందు అందరికి రౌడీ జనార్దన్ గుర్తొచ్చేలా ఉన్నాడు . తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్విసి బ్యానర్ మీద దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 లో ఈ సినిమా రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ లో రెండు నిమిషాల వీడియోలో విజయ్ క్యారెక్టర్ ని పరిచయం చేసాడు దర్శకుడు. ఆ గ్లిమ్ప్స్ ని బట్టి గమనిస్తే… కళింగపట్నం అనే ఊరు ఉండేది.. ఆ ఊరు మొత్తాన్ని రౌడీలు రాక్షస రాజ్యం పాలించినట్టు పాలిస్తారు. ఇక అప్పుడు ఎంట్రీ ఇస్తాడు హీరో. వీళ్ళెవరూ రౌడీలు కాదని ఇంటి పేరునే అలా మార్చుకున్న జనార్ధన.. తప్పు చేసిన వాళ్ళను , అడ్డొచ్చిన వాళ్ళను నరికేందుకు కూడా వెనుకాడడు. అతని వెనుక ఎవరికీ తెలియని ఓ పాస్ట్ ఉంటుంది. ఆ కారణంగానే అతను ఇంత రాక్షసుడిలా మారిపోతాడు. అసలు ఎవరు ఈ జనార్దన్ , ఏంటి అతని కథ అనేది తెలియాలంటే సినిమా వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
విజువల్స్ పరంగా చూస్తే ఇది విజయ్ దేవరకొండ బృటల్ బ్లడ్ బాత్ లానే అనిపిస్తుంది. చాలా ఇంటెన్స్ తో డైరెక్టర్ దీనిని చిత్రీకరించాడనిపిస్తుంది. కింగ్డమ్ తో కాస్త వెనుక పడిన విజయ్ మళ్లీ అదే జోనర్ తో తిరిగి హిట్ కొడతాడేమో చూడాలి. సినిమా కోసం విజయ్ చాలానే ఛేంజ్ అయ్యాడు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.