Swetha
రవి బాబు నుంచి సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులలో ఓ రకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నటుడిగా కంటే కూడా దర్శకుడిగానే రవి బాబు కు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆవిరి , అవును , అనసూయ లాంటి హర్రర్ సినిమాలు ప్రేక్షకులకు అందించాడు రవి బాబు.
రవి బాబు నుంచి సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులలో ఓ రకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నటుడిగా కంటే కూడా దర్శకుడిగానే రవి బాబు కు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆవిరి , అవును , అనసూయ లాంటి హర్రర్ సినిమాలు ప్రేక్షకులకు అందించాడు రవి బాబు.
Swetha
రవి బాబు నుంచి సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులలో ఓ రకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నటుడిగా కంటే కూడా దర్శకుడిగానే రవి బాబు కు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆవిరి , అవును , అనసూయ లాంటి హర్రర్ సినిమాలు ప్రేక్షకులకు అందించాడు రవి బాబు. రీసెంట్ గా ‘ఏనుగు తొండం ఘటికాచలం’ అనే సినిమా వచ్చింది. కానీ అది కేవలం OTT లకే పరిమితం అయింది. ఇక ఇప్పుడు వెండితెర మీద ప్రదర్శించడం కోసం ఓ భయంకరమైన సినిమాను తీసుకుని వస్తున్నాడు రవి బాబు. ఈ సినిమా పేరు రేజర్ . తాజాగా మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు.
ముందు జాగ్రత్తగా ఈ సినిమా కేవలం 18 ఏళ్ళు దాటినా వారికి మాత్రమేనని హెచ్చరించాడు. దానికి కారణం సినిమాలో భయంకరమైన రక్తపాతం ఉండడమే. తల – మొండెం వేరైపోవడం, మనిషి రెండు ముక్కలవ్వడం లాంటి ఒళ్ళు గగ్గురుపొడిచే సీన్స్ ఏ గ్లిమ్ప్స్ మొత్తం ఉన్నాయి. ఆఖరిలో రవి బాబు కనిపించాడు. టైటిల్ గ్లిమ్ప్స్ లోనే ఈ రేంజ్ లో రక్తపాతం ఉంటే ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో.. థియేటర్లో ప్రేక్షకులు ఏమైపోతారో చూడాలి.
ఇది వరకు కూడా రవి బాబు కొన్ని క్రైమ్ కథలు తీశాడు. కానీ ఈ రేంజ్ లో రక్తపాతం ఎక్కడా చూళ్లేదు. న్యాయం కోసం బ్రూటల్‌గా మారిన రవిబాబు ఈ రక్తపాతాన్ని ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు . ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.