iDreamPost

మోదీ కాళ్లకు నమస్కరించిన ప్రముఖ అమెరికన్‌ సింగర్‌.. వీడియో వైరల్‌!

  • Published Jun 24, 2023 | 5:34 PMUpdated Jun 24, 2023 | 5:34 PM
  • Published Jun 24, 2023 | 5:34 PMUpdated Jun 24, 2023 | 5:34 PM
మోదీ కాళ్లకు నమస్కరించిన ప్రముఖ అమెరికన్‌ సింగర్‌.. వీడియో వైరల్‌!

మన ప్రధాని నరేంద్ర మోదీకి.. మన దేశంలోనే కాక విదేశాల్లో సైతం భారీ ఎత్తున అభిమానులు, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన నాయకుల జాబితాలో.. మోదీ టాప్‌ టెన్‌లో ఉంటారు. కొన్నాళ్ల క్రితం పపువా న్యూగినియా దేశ పర్యటనకు వెళ్లిన సమయంలో.. ఆ దేశ ప్రధాని ఏకంగా మోదీ కాళ్లకు నమస్కరించి.. మరీ ఆహ్వానం పలికాడు. ఇక తాజాగా అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఆ దేశ ప్రముఖ సింగర్‌ ఒకరు.. వేదిక మీద మోదీ కాళ్లకు నమస్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరలవుతోంది. ఆ వివరాలు

ప్రధాని నరేంద్ర మోదీ.. మూడు రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. మోదీ పర్యటన ముగింపు నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిలో భాగంగా ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని అయిన మేరీ మిల్బెన్.. మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈమె గతంలో పలు ముఖ్యమైన సందర్భాల్లో.. భారత జాతీయ గీతం జనగణమన, ఓం జై జగదీశ్ హరే గీతాలని ఆలపించి భారతీయులకు సుపరిచితురాలిగా నిలిచారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఆమె మరోసారి భారత జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లకు నమస్కరించారు మేరీ మిల్బెన్‌.

కాళ్లకు నమస్కారం..

యునైటెడ్‌ స్టేట్స్‌ ఇండియన్‌ కమ్యూనిటీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రోనాల్డ్‌ రీగన్‌ బిల్డింగ్‌లో ప్రధాని మోదికి గౌరవసూచకంగా.. అధికారికంగా ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 38 ఏళ్ల మేరీ మిల్బెన్‌.. మొదట జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం భారతీయ జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. భారతీయులు నన్ను తమ ఒక కుటుంబ సభ్యురాలిగా భావించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అలానే నలుగురు అమెరికా అధ్యక్షుల కోసం అమెరికన్‌ దేశభక్తి గీతాన్ని పాడటం కూడా చాలా సంతోషంగా ఉంది. అమెరికన్‌, భారత జాతీయ గీతాలు రెండు కూడా ప్రజాస్వామ్య స్వేచ్ఛకు నిదర్శనంగా ఉంటాయి’’ అని తెలిపారు.

మూడు రోజల పర్యటన నిమిత్తం అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి అగ్రరాజ్యంలో అడుగడుగునా ప్రత్యేక ఆహ్వానాలు వెల్లువెత్తాయి. ఎయిర్‌పోర్టులో విమానం దిగినప్పటి నుంచి పర్యటన ముగింపు కార్యక్రమం వరకు ప్రతీ చోట అపూర్వ స్వాగతం పలికారు. వైట్‌హౌస్, అమెరికన్‌ కాంగ్రెస్‌, సహా ప్రవాస భారతీయులతో సమావేశంలోనూ మోదీ మోదీ అంటూ భారీ ఎత్తున నినాదాలు మార్మోగాయి. ఇందులో ప్రవాస భారతీయులే కాదు.. అమెరికన్‌ పౌరులు సైతం కూడా పాల్గొనడం మరో ప్రత్యేకత.

మోదీ రెండోసారి అమెరికాలో పర్యటించిన వేళ.. ఎంతో చారిత్రాత్మకంగా భావించిన బైడెన్ సర్కార్.. మోదీతో పాటు బైడెన్‌ ఫొటో ఉన్న ఓ భారీ బ్యానర్‌ను చాపర్‌ ద్వారా న్యూయార్క్‌ వీధుల గుండా ఎగురవేశారు. దీంతో పాటు లోయర్‌ మాన్‌హట్టన్‌ నగరంలో ఉన్న వన్‌ వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌ భవనంపై భారతీయ జెండా రంగులు కలిగిన లైట్లను ప్రదర్శించారు. అలానే న్యూయార్క్‌ ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌పైనా మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి