iDreamPost
android-app
ios-app

రూ.500 అద్దె గదిలో హోం టూర్.. జొమాటో డెలివరీ బాయ్ వీడియో వైరల్!

Zomato Delivery Boy: ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లకు హోం టూర్ ల గురించి మనం ఎక్కువగా చూశాము. అయితే తాజాగా ఓ జొమాటో డెలివరీ బాయ్ చేసిన తన గది హోం టూర్ అందరికి కన్నీరు తెప్పించింది. ఈ వీడియోలో..

Zomato Delivery Boy: ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లకు హోం టూర్ ల గురించి మనం ఎక్కువగా చూశాము. అయితే తాజాగా ఓ జొమాటో డెలివరీ బాయ్ చేసిన తన గది హోం టూర్ అందరికి కన్నీరు తెప్పించింది. ఈ వీడియోలో..

రూ.500 అద్దె గదిలో హోం టూర్.. జొమాటో డెలివరీ బాయ్ వీడియో వైరల్!

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెడింగ్ లో ఉంటుంది హోం టూర్ వీడియోలు. సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లకు సంబంధించిన హోం టూర్ వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే  చాలా మంది సెలబ్రిటీలు తమ ఇళ్లు హోం టూర్ చేస్తూ.. ఆ వీడియోను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. ఇలా ప్రముఖుల హోం టూర్ వీడియోలకు బాగా లైక్స్, షేర్ వస్తుంటాయి. అయితే ఎవరైనా ఓ రూ.500 చెల్లించి అద్దెకు ఉండే గదిలో హోం టూర్ చేస్తారా? కానీ ఓ జొమాటో డెలివరీ బాయ్ ఆ సాహసం చేశాడు. ఆ యువకుడు తీసిన హోం టూర్ వీడియో కన్నీరు పెట్టిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈశాన్య భారత దేశానికి చెందిన ప్రంజయ్‌ బోర్గోయరీ అనే యువకుడు ఉపాధి కోసం ముంబయి నగరంకి వెళ్లాడు. అక్కడ ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లో డెలివరీ బాయ్‌ జాబ్ దొరికింది. దీంతో ఆ సంస్థలో డెలివరి బాయ్ గా  పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అక్కడ మురికివాడలోని ఓ ఇరుకైన వీధిలో సోనూ అనే ఫ్రెండ్ తో కలిసి తాను ఉంటున్న చిన్నగదిలో ఉంటున్నారు. దానికి రూ.500 అద్దె చెల్లిస్తుంటారు. అలా జీవనం కోసం మురికివాడలో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇది ఇలాంటి..మురికివాడలో జీవనం గురించి అందరికి తెలియజేయాలని ప్రంజయ్ భావించాడు. ఈ క్రమంలోనే తాను నివాసం ఉండే గదితో పాటు ఆ ప్రాంతాన్ని వీడియో తీశాడు. దానిని ‘స్ట్రగులింగ్ ఆర్టిస్ట్’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో  పోస్టు చేశాడు.

తన వృత్తి, జీవనంతో పాటు కుటుంబ నేపథ్యం, అలవాట్లను ఆవీడియోలో పంచుకున్నాడు. శ్వాస కూడా తీసుకోవడానికి  అవకాశం లేని సంధుల్లో నుంచి అతడు నడుచుకుంటూ వచ్చి.. ఇనుప మెట్లపై నుంచి ఎక్కి తన గదికి చేరుకుని అక్కడ పరిస్థితిని వివరించాడు. అలానే మరో వీడియోలో తాను ఉండే గది బయట ఉన్న టాయిలెట్‌ను చూపిస్తూ అక్కడి దారుణమైన పరిస్థితిని వివరించాడు.

అలాంటి దారుణమై ప్రదేశంలో కూడా ఓ పిల్లిని కూడా అతడు పెంచుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అంతేకాక  పలువురు నెటిజన్లు సైతం ఈ వీడియోపై కామెంట్స్ చేశారు. ముంబైయి లోని మురికివాడల్లో జీవితం ఎంత దుర్బరంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలిసిందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంతటి దుర్భర స్థితిలో కూడా అతడికి ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదని ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడికి ప్రస్తుతం ఇన్‌స్టాలో 1.45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మరి.. ఈ వీడియోను మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by qb_07 (@qb__.07)