iDreamPost
android-app
ios-app

రిస్క్ చేసి మరీ నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని పైకి లాగిన యువకుడు.. వీడియో వైరల్

  • Published Jul 26, 2024 | 5:00 AM Updated Updated Jul 26, 2024 | 5:00 AM

Three Boys Risk Their Lives To Save Others: ప్రాణాలను పణంగా పెట్టి మరీ నదిలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు పైకి లాగారు. తలకిందులుగా వేలాడుతూ మరీ ఆ వ్యక్తిని కాపాడాడో యువకుడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Three Boys Risk Their Lives To Save Others: ప్రాణాలను పణంగా పెట్టి మరీ నదిలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు పైకి లాగారు. తలకిందులుగా వేలాడుతూ మరీ ఆ వ్యక్తిని కాపాడాడో యువకుడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

రిస్క్ చేసి మరీ నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని పైకి లాగిన యువకుడు.. వీడియో వైరల్

కొంతమంది ఇతరులను కాపాడేందుకు ప్రాణాల గురించి ఆలోచించరు. ఇలాంటి వాళ్లకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. రోడ్డు మీద అనుకోని సంఘటనల కారణంగా ఎవరికైనా ఆపద వస్తే ప్రాణాలకు తెగించి కాపాడుతుంటారు. సూపర్ హీరోల్లా క్షణాల్లో స్పందించి ప్రాణాలను కాపాడుతుంటారు. నీళ్లలో మునిగిపోతున్న వారిని కాపాడడం, రోడ్డు ప్రమాదాల నుంచి జనాన్ని కాపాడడం చేస్తుంటారు. ఈ క్రమంలో తమ లైఫ్ నే రిస్క్ లో పెడతారు. అయితే తాజాగా ముగ్గురు వ్యక్తులు నీటిలో ఉన్న వ్యక్తిని కాపాడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. యూట్యూబ్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్ యాప్స్ లో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆ వీడియో ప్రకారం.. ఒక డ్యామ్ దగ్గర ముగ్గురు వ్యక్తులు నీళ్లలో మునిగిన వ్యక్తిని కాపాడుతున్నారు.

డ్యామ్ కి అవతల వైపు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఇవతల వైపు ముగ్గురు వ్యక్తులు కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది. ఇద్దరు వ్యక్తులు బ్రిడ్జి పైన ఉండి ఒక యువకుడి కాళ్ళు పట్టుకోగా.. ఆ యువకుడు తలకిందులుగా వేలాడుతూ నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ వస్తున్న వ్యక్తిని చేత్తో పట్టుకుని పైకి లాగుతాడు. ఈ ఘటనను వీడియో రికార్డ్ చేయగా.. దాన్ని కొందరు నెటిజన్స్ షేర్ చేశారు. ‘దయగల వ్యక్తులు, ధైర్యవంతులు.. ఒక వ్యక్తిని కాపాడేందుకు ముగ్గురు వ్యక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు’ అంటూ క్యాప్షన్ పెట్టి వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఇది నిజం అని కొంతమంది నమ్ముతుండగా.. క్లియర్ గా ఇది రికార్డెడ్ వీడియో అని.. కావాలని తీసిన వీడియో అని కామెంట్స్ చేస్తున్నారు. సరదాల కోసం ఇలాంటి సాహసాలు చేస్తే ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి కొంతమంది మాత్రం తలకిందులుగా వేలాడిన వ్యక్తి వేసుకున్న దుస్తులను బట్టి అతను డ్యామ్ దగ్గర పని చేసే సిబ్బంది కావచ్చునని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి న్యూస్ అయితే ఎక్కడ రాలేదు. కానీ ఈ వీడియో చైనీస్ కి సంబంధించినదిగా తెలుస్తుంది. సరదా కోసం, లైకుల కోసం, వ్యూస్ కోసం తీసిన ప్రాంక్ వీడియో అయినా అయి ఉండాలి.. లేదా నిజంగానే నిజం అయి ఉండాలి. ఒకవేళ నిజమైతే కనుక ఆ యువకుడు చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి వైరల్ వీడియోపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.