Arjun Suravaram
సముద్రంలో తరచూ అనేక విచిత్రమైన ఘటనలు చోటుేచేసుకుంటాయి. పెద్ద పెద్ద నౌకలు ప్రమాదానికి గురికావడం, ఢీ కొట్టుకోవడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఓ భారీ తిమింగలం ఓ బోటుపై దాడి చేసింది. దీంతో అందులోని వారందరూ..
సముద్రంలో తరచూ అనేక విచిత్రమైన ఘటనలు చోటుేచేసుకుంటాయి. పెద్ద పెద్ద నౌకలు ప్రమాదానికి గురికావడం, ఢీ కొట్టుకోవడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఓ భారీ తిమింగలం ఓ బోటుపై దాడి చేసింది. దీంతో అందులోని వారందరూ..
Arjun Suravaram
సముద్రం అనేది దేశాల మధ్య సరకుల రవాణాకు ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే నిత్యం అనేక షిపులు, నౌకలు సముద్రం ద్వారా ప్రయాణం చేస్తుంటాయి. అలానే మరికొందరు బోట్లు వేసుకుని సముద్రంలో చేపల వేటకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రకృతిపరమైన ప్రమాదాలు ఎదురవుతుంటాయి. అలానే మరికొన్ని సందర్భాల్లో సముద్రం జీవులు సైతం దాడి చేస్తుంటాయి. ఇలా అనేక ఘటనలు జరగ్గా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ భారీ తిమింగలం బోటుపై దాడి చేసింది. దీంతో అది కాస్తా ఒక్కసారిగా సముద్రంలోకి ఒరిగిపోయింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
అమెరికాలోని న్యూహాంప్ షైర్ ప్రాంతంలోని సముద్రంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ నగరంలో సమీపంలోని ప్రోట్స్ మౌత్ హార్బర్ సముద్రంలో ఓ భారీ తిమింగలం చేపల వేటకు వెళ్లే బోటుపై దాడి చేసింది. ఒడియోర్న్ పాయింట్ స్టేట్ పార్క్ సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కన్సోల్ బోట్‌లో ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఉదయం చేపల వేటకై సముద్రంలోకి వెళ్లారు. ఇక చేపలు పట్టుకునేందు ప్రయత్నంలో ఉన్నారు. ఇదే సమయంలో వారికి సమీపంలో సముద్రంలో ఏదో భారీ కదలికను గమనించారు. అయితే అది సముద్రంపు అలలు అనుకుని లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ భారీ తిమింగలం వారి బోటు సమీపానికి వచ్చింది. అనంతరం నీటి లోంచి ఒక్కసారిగా గాల్లోకి లేచి బోటుపై దూకింది.
అలా ఆ భారీ తిమిగలం ధాటికి బోటు ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనతో అందులోని వారు భయాందోళనకు గురయ్యారు. ఆ తిమిగలం ఎక్కడ తమను చంపేస్తుందనే భయంతో బోటులోని ఒకరు సముద్రంలోకి దూకేశారు. మరో వ్యక్తి నీటిలో మునిగిపోయాడు. ఇదంతా దూరం నుంచి గమనించిన ఇతర బోటు వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంలో ఉన్న ఆ ఇద్దరిని సురక్షితంగా కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన చాలా భయానకంగా ఉందని, ఆ బోటులోని వారు అదృష్టవంతులు అంటు కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోను మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Whale lands on #boat pic.twitter.com/AZwV2hsqFT
— Beney de Saxonne (@SergueyB) July 24, 2024