iDreamPost

ఆ కారణంతోనే లోకేశ్ ఉత్తరాంధ్రలో పాదయాత్ర లేదంట?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. అయితే ఈ యాత్ర విశాఖపట్నం వరకే సాగనుంది. అందుకు గల కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. అయితే ఈ యాత్ర విశాఖపట్నం వరకే సాగనుంది. అందుకు గల కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

ఆ కారణంతోనే లోకేశ్ ఉత్తరాంధ్రలో పాదయాత్ర లేదంట?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనవరి 27న కుప్పంలో ఈ యాత్రను ప్రారంభించారు. జనం నుంచి స్పందన లేకపోయినా యాత్రను తూర్పుగోదావరి జిల్లా రాజోల్ వరకు తీసుకెళ్లాడని పొలిటికల్ సర్కిల్ లో టాక్. అదే సమయంలో ఆయన తండ్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో యాత్ర అక్కడితో ఆగిపోయింది. దాదాపు రెండున్నర నెలలు పాటు యాత్ర గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తాజాగా ఈ నెల 27 నుంచి తిరిగి యువగళం పాదయాత్ర ప్రారంభించనున్నారు. అయితే తొలుత అనుకున్న ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కాకుండ విశాఖపట్నం వరకేని టీడీపీ తెలిపింది. అయితే లోకేశ్ ఉత్తరాంధ్రలో నడవాలంటే భయమేస్తోంది, అందుకు ఒక బలమైన కారణం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  నవంబర్ 27 నుంచి యువగళం పాదయాత్ర చేపట్టనున్నారు. చంద్రబాబు సాకు చూపి..లోకేస్ సుదీర్ఘ విరామం తీసుకున్నారనే టాక్ కూడా వినిపించింది. ఇక పాదయాత్ర విషయంలో తొలుత కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు అని ప్రణాళిక వేశారు. అయితే కొత్త షెడ్యూల్ లో విశాఖపట్నం చేరుకున్న తరువాత పాదయాత్రను విరమిస్తారు. చంద్రబాబు అరెస్టు కారణంగా వచ్చిన విరామం వలన, ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయడం సాధ్యం కాదని, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక .. విశాఖ పట్నం వద్ద ముగించాలని అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే అసలు రహస్యం మరొకటి ఉందని పొలిటికల్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తోన్నాయి. ఉత్తరాంధ్రలో అడుగుపెట్టడానికి నారా లోకేశ్ భయపడుతున్నారని టాక్. మూడు రాజధానుల రూపంలో రాష్ట్రంలో సమానాభివృద్ధికి సీఎం జగన్ మోహన్ రెడ్డి  నిశ్చయించుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ మాత్రం మూడు రాజధానులను వ్యతిరేకిస్తుంది. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటీవ్ రాజధాని టీడీపీ  ఘోరంగా వ్యతిరేకిస్తోంది.

దీంతో విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో టీడీపీకి  ప్రతికూలత ఉందనే టాక్ వినిపిస్తోంది.  ప్రజలు ఆ పార్టీని అసహ్యించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు.  తమ ప్రాంతం బాగుపడే ఆలోచన సీఎం జగన్ చేస్తుంటే.. తెదేపా అడ్డుకుంటోందని ప్రజలు కోపగించుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందనే భయంతోనే నారా లోకేశ్ తన పాదయాత్రను వైజాగ్ తో నిలిపివేయాలని భావిస్తున్నట్లుగా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

గతంలోను అమరావతి రైతుల ముసుగులో టీడీపీ స్పాన్సర్ చేసిన పాదయాత్ర అరసవెల్లి వరకు ప్లాన్ చేసినది కూడా మధ్యలోనే ఆగిపోయిందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ప్రజల నుంచి ప్రతిఘటన రావడంతో పాటు, పోలీసులు రైతుల ఐడీ ఫ్రూప్ అడగడంతో ఆ ముసుగులో యాత్ర చేస్తున్న పేయిడ్ ఆర్టిస్టులు జారుకున్నారంట. అలాంటి ప్రజా వ్యతిరేకత ఇప్పుడు కూడా తప్పదని ఆ పార్టీ నే భయపడుతోందని టాక్ వినిపిస్తోంది. మరి.. సోషల్ మీడియాలో వినిపిస్తోన్న ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి