iDreamPost

ఆ ఒక్కటే వరుణ్ నాకు చెప్పలేదు

ప్రతి విషయం తనకు చెప్పే వరుణ్ ఆ ఒక్కటే దాచాడన్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ప్రతి విషయం తనకు చెప్పే వరుణ్ ఆ ఒక్కటే దాచాడన్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆ ఒక్కటే వరుణ్ నాకు చెప్పలేదు

అందరం కలిసే ఉండేవాళ్ళం, అందుకే వరుణ్ తేజ్ చిన్నప్పట్నించీ తనతో ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకున్నాడని, తనకూ వరుణ్ అంటే అంతే వాత్సల్యం, ప్రేమ ఉన్నాయని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. మార్చి 1వ తేదీన వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలంటైన్’ వరల్డ్ వైడ్ రిలీజవుతుండగా, ఆదివారం సాయంత్రం గ్రాండ్ లెవెల్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా వచ్చిన పద్మవిభూషణ్ చిరంజీవి తనకూ వరుణ్ తేజ్ మధ్యన ఉన్న అనుబంధం గురించి చెబుతూ మాట్లాడారు. ‘ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. అందుకే చిన్నప్పట్నుంచీ వరుణ్ నాతో బాగా చనువు, బంధం పెంచుకున్నాడు. వాడి ముందే మేకప్ చేసుకోవడం, కాస్ట్యూమ్స్ వేసుకోవడం అన్నీ ప్రత్యక్షంగా చూసేవాడు. అందుకేనేమో తనకీ యాక్టింగ్ కెరీర్ మీద ఆసక్తి పెరిగిందని నేననుకుంటున్నాను. అయితేనేం మంచి సినిమాలు చేస్తున్నాడు’ అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.

‘రెండో సినిమాయే ‘కంచె’ లాంటి కథని వరుణ్ ఎంపిక చేసుకున్నప్పుడే నాకు చాలా సంతోషమనిపించింది. డిఫరెంట్ సినిమాలు చేయడమనేది అంత త్వరగా మనసులోకి రావడం నిజంగా ఓ బెస్ట్ పాయింట్. సినిమా సినిమాకూ తనలోని వైవిధ్యం చూపించుకుంటూ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ, ఇదిగో ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్’ లాంటి గొప్ప కథతో సినిమా చేసే స్థాయికి వచ్చాడు. నాకు ఆ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మన దేశంలో రియల్ హీరోలుగా దేశ రక్షణ విషయంలో రేయింబవళ్ళు దేశ ప్రజల సంరక్షణలో నిమగ్నమయ్యే వీరజవాన్లకు సంబంధించిన కథలు చేయడం నిజంగా అభినందనీయం. పైగా అతి తక్కువ కాలంలో, నిర్ణీతమైన బడ్జెట్లో చేసి అంత క్వాలిటీ తీసుకురాగలిగారంటే అంత కన్నా గొప్ప విషయం మరొకటి లేదు’ అని చిరు ఉద్విగ్నభరితంగా మాట్లాడారు.

మెగాస్టార్ మాట్లాడే ముందు యాంకర్ సుమ ఆయన దగ్గరకు వచ్చి, కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అడుగుతూ, కొన్ని ఫొటోలు, కొన్ని సినిమా క్లిప్పింగ్స్ చూపించి వాటి మీద వివరణ అడిగారు. అందులో మెగాస్టార్, నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు చిన్ననాటి వరుణ్ తేజ్ ని చూపించి ఆ ఫోటో గురించి అడిగితే ‘మా ముగ్గురితో చిన్నప్పుడే కలసి ఫోటో తీయించుకున్నాడంటే వరుణ్ ఫేట్ అప్పుడే డిసైడ్ అయిందని అనుకుంటున్నా. చైనా బాయ్ లా ఉండేవాడు వరుణ్’ అని చిరు చెప్పారు. ఆ తర్వాత ఆయనతో చిన్ననాటి వరుణ్ తేజ్ నటించిన క్లిప్పింగ్ కూడా ప్రదర్శించారు. ఆ తర్వాత సుమ మాట్లాడుతూ, అన్నీ చెప్పే వరుణ్ లావణ్య గురించి ముందుగానే చెప్పాడా అని అడిగితే.. అన్నీ చెప్తాడు గానీ, ఆ ఒక్క విషయం మాత్రం చెప్పలేదని మెగాస్టార్ చమత్కరించారు. దానికి వివరణ ఇస్తూ వరుణ్ ‘ముందుగా చెప్పలేదు గానీ, చెప్పినప్పుడు మాత్రం ముందు డాడీ (మెగాస్టార్)కే చెప్పాను’ అని వివరించాడు. మరి.. వరుణ్ గురించి మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మోహన్ బాబు మాస్ వార్నింగ్.. నా పేరు రాజకీయంగా వినియోగిస్తే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి