iDreamPost

అదానీ గ్రూప్ కంపెనీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన జనం!

ఇటీవల పలు చోట్ల అగ్ని ప్రమాదల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.

ఇటీవల పలు చోట్ల అగ్ని ప్రమాదల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.

అదానీ గ్రూప్ కంపెనీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన జనం!

ఇటీవల ప్రమాదాలు ఎలా ముంచుకు వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా అగ్ని ప్రమాదాల వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. ఆయిల్ కంపెనీలు, కెమికల్ పరిశ్రమలు, బాణా సంచ ఫ్యాక్టరీల్లో అగ్ని ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని మిగుల్చుతున్నాయి. తాజాగా ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించి తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లోని సహరన్ పూర్ లో ఉన్న ఓ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీ ఆస్తినష్టం వాటిల్లింది. రాత్రి 12 గంటల ప్రాంతంలో గోదాములో చెలరేగిన మంటల వల్ల నెయ్యి, నూనె డబ్బాలు బాంబుల్లా పేలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తమ వద్ద ఉన్న ఫైర్ ఇంజన్లతో పాటు.. ఇతర జిల్లాల నుంచి పలు ఫైర్ ఇంజన్లను రప్పించారు. 12 అగ్నిమాకప దళ వాహనాలు మంటలను పలు రౌండ్ల ద్వార నీళ్లు చల్లినా లోపల ఉన్న డబ్బాలు పెద్ద శబ్ధాలతో పేలిపోతూ వచ్చాయి. గోదాం నివాస ప్రాంతానికి దగ్గరలో ఉండటం వల్ల భద్రత కారణాల దృష్ట్యా అక్కడికి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. గోదాము అదానీ గ్రూప్ కి చెందినదని చెబుతున్నారు.

ఈ గోదాం బెహత్ రోడ్ లోని రసూల్ పూర్ లో ఉంది. ఫార్చ్యూన్‌తో సహా ఇతర బ్రాండ్ కి సంబంధించి నూనె డబ్బాలు ఇందులో భద్రపరిచారు. దాదాపు 7 బీఘాలలో నిర్మించి ఈ గడ్డింగిని ప్యాక్ చేసిన పిండి, చక్కర, నూనె, శుద్ది చేసిన ఇతర వస్తువులతో నింపారు. ఈ గోదాం నుంచి ఉత్తరఖాండ్, పశ్చిమ యూపికి ఆహార పదార్థాలను సరఫరా చేస్తారని తెలుస్తుంది. గోదాం అగ్ని ప్రమాదానికి గురి కావడంతో కాలనీలో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఊపిరి పీల్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానికంగా ఉన్న 50 కి పైగా ఇళ్లలోని ప్రజలను ఇళ్లనుంచి బయటకు పంపించామని.. ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి