iDreamPost

ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన రూపాయి.. చివరకు ప్రాణాం తీసింది! అసలేం జరిగిందంటే?

ఇద్దరు ప్రాణస్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన ఓ రూపాయి.. ఏకంగా ప్రాణాలనే తీసింది. ఈ విషాదకర సంఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుంది. అసలేం జరిగిందంటే?

ఇద్దరు ప్రాణస్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన ఓ రూపాయి.. ఏకంగా ప్రాణాలనే తీసింది. ఈ విషాదకర సంఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుంది. అసలేం జరిగిందంటే?

ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన రూపాయి.. చివరకు ప్రాణాం తీసింది! అసలేం జరిగిందంటే?

“రూపాయి.. రూపాయి నువ్వేం చేస్తావ్ అంటే? అన్నదమ్ముల మధ్య గొడవలు పెడతాను, భార్యభర్తలను విడగొడతాను” అన్న ‘ఆ నలుగురు’ సినిమాలోని డైలాగ్ మనందరికి గుర్తే. ఇక కేవలం రూ. 5 రూపాయల ఫ్యాక్షన్ అంటూ త్రివిక్రమ్ అరవింద సమేత మూవీలో చూపించిన విషయం మనకు తెలియనిది కాదు. అచ్చం ఇలాంటి ఘటనే వరంగల్ లో చోటుచేసుకుంది. కేవలం ఒకే ఒక్క రూపాయి విషయంలో గొడవ పెరిగి.. ప్రాణ స్నేహితుడి ప్రాణాలు తీసింది. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన స్నేహితుల మధ్య రూపాయి పెట్టిన ఆ చిచ్చు ఏంటి? ప్రాణాలు తీసుకునేంత అక్కడ ఏం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేమ్ సాగర్, అరవింద్ ప్రాణస్నేహితులు. వరంగల్ లోని గాంధీనగర్ కు చెందిన వీరిద్దరు కలిసి పెరిగారు. కలిసి చదువుకున్నారు. ఇద్దరు కలిసి శుక్రవారం స్థానికంగా ఉన్న ఓ బిర్యానీ హోటల్ కు వెళ్లారు. బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తిన్నారు. అయితే బిల్లు రూ. 59 కాగా.. రూ. 60 రూపాయాలు యూపీఐ ద్వారా యజమానికి చెల్లించాడు అరవింద్. ఈ క్రమంలో మధ్యలో జోక్యం చేసుకున్న ప్రేమ్ సాగర్.. “ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చేంత పెద్దోడివి అయ్యావురా నువ్వు” అంటూ నవ్వుకుంటూ ఎగతాళిగా అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవ పెద్దగా మారింది.

ఈ క్రమంలోనే ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లారు. ఒకరిని ఒకరు తోసుకునే క్రమంలో అరవింద్.. ప్రేమ్ సాగర్ ను తోసేయడంతో.. పక్కనే ఉన్న బండరాయిపై పడ్డాడు. దాంతో తలకు తీవ్రగాయమైంది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఒక్క రూపాయి ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చుపెట్టడమే కాకుండా.. ఒకరి ప్రాణం పోయేలా చేసింది. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి