iDreamPost

భర్త వేతనం గురించి తెలుసుకునే హక్కు భార్యకు ఉంది : మద్రాస్ హైకోర్టు

సంసార బంధానికి సంబంధించి ఇటీవల పలు కోర్టుల్లో కీలక తీర్పులు వెలువడుతున్నాయి. మొన్నటి మొన్న వేరు కాపురం పెడదామన్న, శృంగారానికి సహకరించకపోయినా భార్యకు విడాకులు ఇవ్వొచ్చునని పేర్కొంది. ఇప్పుడు మరో కీలక తీర్పును వెల్లడించింది.

సంసార బంధానికి సంబంధించి ఇటీవల పలు కోర్టుల్లో కీలక తీర్పులు వెలువడుతున్నాయి. మొన్నటి మొన్న వేరు కాపురం పెడదామన్న, శృంగారానికి సహకరించకపోయినా భార్యకు విడాకులు ఇవ్వొచ్చునని పేర్కొంది. ఇప్పుడు మరో కీలక తీర్పును వెల్లడించింది.

భర్త వేతనం గురించి తెలుసుకునే హక్కు భార్యకు ఉంది : మద్రాస్ హైకోర్టు

ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా చట్టాలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే తీర్పుల్లో కూడా ఛేంజస్ చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా భార్యా భర్తల బంధానికి సంబంధించిన పలు కోర్టులు కీలక తీర్పులను ఇస్తున్నాయి. భార్యా భర్తలు కలిసి ఉండటలేమనప్పుడు పరస్సర అంగీకారం ఉంటే విడాకుల కోసం ఆరు నెలలు కూడా వేచి చూడాల్సిన అవసరం లేదని, వెంటనే డివోర్స్ మంజూరు చేయవచ్చునని దేశ అత్యున్నత న్యాయస్థానమే సెలవిచ్చిన సంగతి విదితమే. అలాగే భార్య వేరే కాపురం పెడదామన్నా..శృంగారానికి సహకరించకపోయినా విడాకులు ఇవ్వొచ్చునని పలు కోర్టులు తీర్పునిచ్చాయి.

ఇప్పుడు మద్రాస్ కోర్టు భర్త జీతం విషయంలో సంచలన తీర్పునిచ్చింది. విడాకులు తీసుకున్నప్పుడు భరణం కోసం తన భర్త వేతనం వివరాలు తెలుసుకునే హక్కు భార్యకు ఉందని స్పష్టం చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. మనస్పర్థలు కారణంగా దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. అయితే భరణం కోసం తన భర్త వేతన వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా కోరింది భార్య. దీనిపై భర్త అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. వేతన వివరాలు అందించేందుకు నిరాకరించింది. కాగా, ఆమె రాష్ట్ర సమాచార కమిషన్‌ను సంప్రదించారు. కేసును పరిశీలించిన సమాచార కమీషన్.. భర్త జీతం వివరాలు ఇవ్వాలని ఆ సంస్థకు ఆదేశించింది.

2020లో ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ.. భర్త మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే విచారణ చేపట్టిన జస్టిస్ జీ ఆర్ స్వామినాథన్ నేతృత్వంలోని మధురై బెంచ్ ‘ పిటిషనర్ భార్యను థర్డ్ పార్టీగా పరిగణించలేం.. వారి మధ్య విడాకుల వ్యవహారం పెండింగ్‌లో ఉంది. ఆ సమయంలో స్త్రీకి కొన్ని ప్రాథమిక అవసరాలు ఉంటాయి. ఆమెకు చెల్లించాల్సిన మెయింటెనెన్స్ పిటిషనర్ సంపాదించే రెమ్యునరేషన్ పై ఆధారపడి ఉంటుంది. ఆమెకు ఆ వివరాలు తెలియకపోతే.. తనకు న్యాయమైన భరణం కోసం దావా ఎలా వేస్తుంది’ అని ప్రశ్నిస్తూ .. అతని అభ్యర్థనను తిరస్కరించింది. రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాలను సమర్థించింది. తన భర్త పొందే వేతనం వివరాలు భార్య తెలుసుకునే హక్కు ఉందన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను ఈ సందర్భంగా ఉటంకించింది కోర్టు. మరీ ఈ తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి