iDreamPost

సిటీకి 10 కి.మీ. దూరంలో 20 లక్షల్లోపే విశాలమైన స్థలం.. సామాన్యులకిదే మంచి ఛాన్స్

రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్ళు అయినా.. సొంతిల్లు కట్టుకోవాలని అనుకునేవాళ్ళు అయినా.. ఇల్లు కట్టి అద్దెకు ఇవ్వాలనుకునేవాళ్ళు అయినా గానీ.. సిటీలో లేదా సిటీకి అతి దగ్గరలో ఉన్న స్థలాలను కొనుక్కుంటే.. అది కూడా తక్కువ ధరకు దొరికే స్థలాలు కొనుక్కుంటే బోలెడన్ని లాభాలు ఉంటాయి. అటువంటి లాభాలను తెచ్చిపెట్టే ఏరియా గురించి మీరు తెలుసుకోబోతున్నారు.

రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్ళు అయినా.. సొంతిల్లు కట్టుకోవాలని అనుకునేవాళ్ళు అయినా.. ఇల్లు కట్టి అద్దెకు ఇవ్వాలనుకునేవాళ్ళు అయినా గానీ.. సిటీలో లేదా సిటీకి అతి దగ్గరలో ఉన్న స్థలాలను కొనుక్కుంటే.. అది కూడా తక్కువ ధరకు దొరికే స్థలాలు కొనుక్కుంటే బోలెడన్ని లాభాలు ఉంటాయి. అటువంటి లాభాలను తెచ్చిపెట్టే ఏరియా గురించి మీరు తెలుసుకోబోతున్నారు.

సిటీకి 10 కి.మీ. దూరంలో 20 లక్షల్లోపే విశాలమైన స్థలం.. సామాన్యులకిదే మంచి ఛాన్స్

సిటీలో లేదా సిటీకి దగ్గరలో సొంతిల్లు కట్టుకోవాలని లేదా స్ధలం మీద ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదించాలని చాలా మందికి ఉంటుంది. హైదరాబాద్ లో ఒకప్పుడు చాలా తక్కువ ధరకు దొరికిన భూములు ఇప్పుడు ఎంత కాస్ట్లీ అయిపోయాయో చెప్పాల్సిన పని లేదు. చాలా మంది కొనలేదే, కొనలేకపోయామే అని ఇప్పటికీ బాధపడుతుంటారు. అయితే అలాంటి వారికి మరొక అవకాశం వచ్చిందనే చెప్పుకోవాలి. హైదరాబాద్ మహానగరంలో 20 లక్షలోపు వంద గజాల స్థలం దొరకడం అనేది అసాధ్యం. సిటీ నుంచి 20, 30 కి.మీ. అవతలకు వెళ్లినా గానీ గజం 25 వేల నుంచి 30 వేలు ఉంది. ఇంత రేటు పెట్టి సిటీ అవతల కొనే కంటే కూడా సిటీలో, సిటీకి 10 కి.మీ. దూరంలో ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఇన్వెస్ట్ చేసే వారికైనా.. లేదా సొంతిల్లు కట్టుకుని ఉండాలనుకునేవారికైనా ఇప్పుడు చెప్పుకోబోయే ప్రాంతం అనుకూలమైనదిగా ఉంది. 

ఆ ఏరియా ఇదే:

విశాఖపట్నం సబ్ అర్బన్ ఏరియాగా ఉన్న దువ్వాడ ప్రాంతం ఇన్వెస్ట్మెంట్ కి అనువైన ఏరియాగా చెప్పవచ్చు. విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ కి (వీసెజ్), వైజాగ్ స్టీల్ ప్లాంట్ సహా పలు విద్యాసంస్థలకు అతి దగ్గర్లో ఉంది. దువ్వాడలో రైల్వేస్టేషన్ కూడా ఉండడం మరొక ప్లస్ పాయింట్. వైజాగ్ నుంచి దువ్వాడ కేవలం 10 కి.మీ. దూరంలో ఉంది. 20 నిమిషాల్లో దువ్వాడ నుంచి వైజాగ్ చేరుకోవచ్చు. షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, పార్కులు, బ్యాంకులు, మూవీ థియేటర్లు.. ఇలా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. 

దువ్వాడలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రయోజనాలు:

  • ఇండస్ట్రియల్ జోన్స్, ఐటీ కారిడార్లకి దగ్గరలో ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దీని వల్ల రెంటల్ డిమాండ్ అనేది పెరుగుతుంది. 
  • ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా కొనసాగుతుంది. రోడ్స్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సహా అనేక డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. 
  • ల్యాండ్ మీద మంచి అప్రిసియేషన్ వస్తుంది. దువ్వాడ చుట్టూ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ జరగడం వల్ల రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది పెరుగుతుంది. దీని వల్ల ల్యాండ్ రేటు పెరుగుతుంది. 

ధర:

ప్రస్తుతం దువ్వాడలో చదరపు అడుగు 2 వేల రూపాయలు పలుకుతుంది. గజం 18 వేలు. 110 గజాల స్థలానికి 19,80,000 అవుతుంది. 110 గజాలు అంటే 2 బీహెచ్కే ఫ్లాట్ కి సరిపడా స్థలం. 20 లక్షలోపు విశాలమైన ప్లాట్ వస్తుందంటే సామాన్యులకు ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదనే చెప్పాలి. గజం 14 వేలు, 15 వేల రేంజ్ లో ఉన్న స్థలాలు కూడా ఉన్నాయి. విశాఖపట్నంలో, వైజాగ్ సిటీకి ఇంత తక్కువ దూరంలో అతి తక్కువ ధరకే స్థలాలు దొరుకుతున్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో భారీ లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.    

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి