iDreamPost
android-app
ios-app

ఐఫోన్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. ఏయే మోడల్స్ అంటే?

Apple Company Slashes iPhone Prices After Union Budget 2024-25: ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్. యాపిల్ కంపెనీ పలు మోడల్స్ పై ధరలను తగ్గించింది. యూనియన్ బడ్జెట్ 2024-25లో భాగంగా మొబైల్ ఫోన్లపై కస్టమ్ డ్యూటీని తగ్గించిన నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ల ధరలను తగ్గించింది.

Apple Company Slashes iPhone Prices After Union Budget 2024-25: ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్. యాపిల్ కంపెనీ పలు మోడల్స్ పై ధరలను తగ్గించింది. యూనియన్ బడ్జెట్ 2024-25లో భాగంగా మొబైల్ ఫోన్లపై కస్టమ్ డ్యూటీని తగ్గించిన నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ల ధరలను తగ్గించింది.

ఐఫోన్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. ఏయే మోడల్స్ అంటే?

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25లో భాగంగా మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, మొబైల్ విడి భాగాల మీద బేసిక్ కస్టమ్ డ్యూటీని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమల నుంచి ఈ తగ్గుదల అనేది ప్రధాన డిమాండ్ గా ఉండడంతో కేంద్రం కస్టమ్ డ్యూటీని తగ్గించింది. దీంతో భారతదేశంలో తయారయ్యే ఫోన్లకు 18 శాతం జీఎస్టీ మాత్రమే విధించబడుతుంది. ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఫోన్లను భారత్  కి దిగుమతి చేసుకుంటుండగా.. మిగతా మోడల్స్ మాత్రం ఇక్కడే తయారవుతున్నాయి. అయితే కేంద్రం బడ్జెట్ లో కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత భారత్ లో ఐఫోన్ల ధరలను తగ్గించింది. పలు ఐఫోన్ మోడల్స్ ధరలను 3 నుంచి 4 శాతం మేర తగ్గించి. ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్స్ పై రూ. 5,100 నుంచి రూ. 6 వేల వరకూ తగ్గింపు లభిస్తుంది. ఇక భారత్ లో తయారైన ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 మోడల్స్ పై 3 వేల రూపాయలు తగ్గుతుంది. ఐఫోన్ ఎస్ మోడల్ మీద రూ. 2,300 తగ్గింపు లభిస్తుంది. బేస్ మోడల్స్ పై 300 రూపాయలు, హై ఎండ్ ప్రో మోడల్స్ పై 6 వేల వరకూ తగ్గించింది. యాపిల్ అధికారిక స్టోర్ లో ధరలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.     

ఐఫోన్ ధరలు:

ఐఫోన్ 15:

ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ల మీద 300 రూపాయలు తగ్గించింది. 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్ల మీద 300 రూపాయలు తగ్గించింది. ఐఫోన్ 15 పాత ధర రూ. 79,900 ఉండగా ప్రస్తుతం రూ. 79,600గా ఉంది. 256 జీబీ వేరియంట్ పాత ధర రూ. 89,900 ఉండగా ప్రస్తుతం రూ. 89,600గా ఉంది. 512 జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900 ఉండగా ప్రస్తుతం రూ. 1,09,600గా ఉంది. 

ఐఫోన్ 15 ప్లస్:

ఐఫోన్ 15 ప్లస్ 128 జీబీ ఫోన్ పాత ధర రూ. 89,900 ఉండగా ప్రస్తుతం రూ. 89,600గా ఉంది. 256 జీబీ వేరియంట్ పాత ధర రూ. 99,900 ఉండగా, ప్రస్తుతం రూ. 99,600గా ఉంది. 512 జీబీ వేరియంట్ పాత ధర రూ. 1,19,900 ఉండగా ప్రస్తుతం రూ. 1,19,600గా ఉంది. 

ఐఫోన్ 15 ప్రో:

ఐఫోన్ 15 ప్రో 128 జీబీ వేరియంట్ పాత ధర రూ. 1,34,900 ఉండగా రూ. 5,100 తగ్గించిన తర్వాత ప్రస్తుతం రూ. 1,29,800గా ఉంది. 256 జీబీ వేరియంట్ పాత ధర రూ. 1,44,900 ఉండగా ప్రస్తుతం రూ. 1,39,800గా ఉంది. 512 జీబీ వేరియంట్ పాత ధర రూ. 1,64,900 ఉండగా ప్రస్తుతం రూ. 1,59,700గా ఉంది. 1 టీబీ వేరియంట్ పాత ధర రూ. 1,84,900 ఉండగా.. ప్రస్తుతం రూ. 1,79,400గా ఉంది. 

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్:

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 256 జీబీ వేరియంట్ పాత ధర రూ. 1,59,900 ఉండగా ప్రస్తుతం రూ. 1,54,000గా ఉంది. 512 జీబీ వేరియంట్ పాత ధర రూ. 1,79,900 ఉండగా ప్రస్తుతం రూ. 1,73,900గా ఉంది. 1 టీబీ వేరియంట్ పాత ధర రూ. 1,99,900 ఉండగా ప్రస్తుతం రూ. 1,93,500గా ఉంది.       

ఐఫోన్ 14:

ఐఫోన్ 14 128 జీబీ వేరియంట్ పాత ధర రూ. 69,900 ఉండగా ప్రస్తుతం రూ. 69,600గా ఉంది. 256 జీబీ వేరియంట్ పాత ధర రూ. 79,900 ఉండగా ప్రస్తుతం రూ. 79,600గా ఉంది. 512 జీబీ వేరియంట్ పాత ధర రూ. 99,900 ఉండగా ప్రస్తుతం రూ. 99,600గా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి