iDreamPost

విడాకుల బాట పడుతోన్న మరో స్టార్ కపుల్. . సోషల్ మీడియా నుండి ఫోటోస్ డిలీట్

వరుసగా డివోర్స్ వార్తలు అభిమానుల్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ నాట. ఐశ్వర్య- ధనుష్, జీవి ప్రకాష్-సైంధవి డివోర్స్ వార్తలతో బాధల్లో ఉన్నారు ఫ్యాన్స్. అంతలో మరో స్టార్ సెలబ్రిటీ జంట విడిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

వరుసగా డివోర్స్ వార్తలు అభిమానుల్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ నాట. ఐశ్వర్య- ధనుష్, జీవి ప్రకాష్-సైంధవి డివోర్స్ వార్తలతో బాధల్లో ఉన్నారు ఫ్యాన్స్. అంతలో మరో స్టార్ సెలబ్రిటీ జంట విడిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

విడాకుల బాట పడుతోన్న మరో స్టార్ కపుల్. . సోషల్ మీడియా నుండి ఫోటోస్ డిలీట్

ఇండస్ట్రీలో ఓ వైపు పెళ్లి వార్తలు వినిపిస్తుంటే.. మరో వైపు వెండితెర, బుల్లితెరపై రాణిస్తున్న ప్రముఖుల విడాకుల న్యూస్‌లు హల్ చల్ చేస్తున్నాయి. సమంత, నాగ చైతన్య డివోర్స్ వార్తను ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. అంతలో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల వరుసగా విడాకులు వార్తలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ధనుష్-ఐశ్వర్య విడాకులు తీసుకున్నామంటూ ఎనౌన్స్ చేశారు. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్.. తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. అంతలో మరో స్టార్ కపుల్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. భార్యా భర్తలిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుండి కొన్ని ఫోటోలు తీసేయడమే అందుకు కారణమైంది.

ఇంతకు ఆ స్టార్ కపుల్స్ ఎవరంటే.. జయం రవి అండ్ ఆయన భార్య ఆరతి. వీరిద్దరూ ఎప్పటి నుండో విడాకులు తీసుకోబోతున్నారటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. కొంత మంది ఈ రూమర్స్ తోసిపుచ్చారు. తాజాగా రవి తన ఇన్ స్టా ఖాతా నుండి భార్య ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు తీసేయడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. అంతేకాకుండా ఆరతి సైతం కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాల నుండి తొలగించడంతో దాదాపుగా ఈ ఇద్దరు డివోర్స్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. గత కొంత కాలంగా ఈ ఇద్దరి మధ్య విబేధాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆరతిని 2009లో వివాహం చేసుకున్నాడు జయం రవి. తమిళంలో ప్రముఖ నిర్మాత సుజాత విజయ్ కుమార్‌ కూతురే ఆరతి. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. .

వారిలో ఆరవ్ ఇటీవల టిక్ టిక్ టిక్ అనే సినిమాలో నటించాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో రవి, ఆరతి జంట క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకుంది. కానీ కొన్నాళ్ల నుండి విబేధాలు జరుగుతున్నాయని, కొన్ని రోజుల నుండి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయని సమాచారం. దీంతో వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని మీడియా కోడై కూస్తోంది. అంతలోనే రవి, ఆరతి సోషల్ మీడియా నుండి ఫోటోలు తొలగించడంతో ఈ రూమర్లను నిజం చేసినట్లయ్యింది. ఇప్పుడు వీరి చర్యతో తమిళ సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. త్వరలో ఈ ఇద్దరు విడాకులు తీసుకోవడం కన్ఫమ్ అంటున్నారు. దీనిపై ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప.. ఈ గాసిప్స్‌కు చెక్ పడే అవకాశం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి