iDreamPost

Kalki 2898 AD: కల్కి నుంచి మరో వీడియో వచ్చేసింది.. ఇది వేరే లెవల్‌ అంతే!

  • Published Jun 24, 2024 | 3:13 PMUpdated Jun 24, 2024 | 3:13 PM

ప్రభాస్‌ నటించిన కల్కి సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది.. చిత్ర బృందం.. మూవీకి సంబంధించిన ఒక్కో ఆసక్తికర పాయింట్‌ రివీల్‌ చేస్తూ.. సినిమా మీద ఆసక్తి మరింత పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్కి టీమ్‌ మరో వీడియోను రిలీజ్‌ చేశారు. ఆ వివరాలు..

ప్రభాస్‌ నటించిన కల్కి సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది.. చిత్ర బృందం.. మూవీకి సంబంధించిన ఒక్కో ఆసక్తికర పాయింట్‌ రివీల్‌ చేస్తూ.. సినిమా మీద ఆసక్తి మరింత పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్కి టీమ్‌ మరో వీడియోను రిలీజ్‌ చేశారు. ఆ వివరాలు..

  • Published Jun 24, 2024 | 3:13 PMUpdated Jun 24, 2024 | 3:13 PM
Kalki 2898 AD: కల్కి నుంచి మరో వీడియో వచ్చేసింది.. ఇది వేరే లెవల్‌ అంతే!

ప్రస్తుతం మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమానే. డార్లింగ్‌​ ప్రభాస్‌ నటించిన కల్కి ట్రెండ్‌ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ మీద.. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన, అన్నా బెన్‌ వంటి దిగ్గజాలు నటిస్తున్నారు. పైగా భారీ బడ్జెట్‌తో కల్కిని తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈ సినిమా మీద పాన్‌ వరల్డ్‌ స్థాయిలో అంచానాలు నెలకొని ఉన్నాయి.

ఇక చిత్ర బృందం కూడా అందుకు తగ్గట్టుగానే కల్కి ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపడుతుంది. ఇక మరో 72 గంటల్లో అనగా మూడు రోజుల్లో కల్కి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్‌ అమ్మకాలు ప్రారంభించారు. ఈ క్రమంలో సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది ఊహించని ట్విస్ట్‌లు ఇచ్చి ప్రేక్షకులను అల్లాడిస్తున్నారు కల్కి టీమ్‌. ఈ క్రమంలో తాజాగా కల్కి టీమ్‌ మరో వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా కల్కి టీమ్‌ ‘థీమ్‌ ఆఫ్‌ కల్కి’ పేరుతో ఒక గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో దీనిని తెరకెక్కించారు. దీన్ని సీనియర్‌ నటి శోభనపై షూట్‌ చేశారు. ఈ వీడియోల శోభనతో పాటు మరికొందరు నృత్య ప్రదర్శన చేశారు. అందుకు సంబంధించిన గ్లింప్స్‌ వీడియోను నేడు విడుదల చేయడంతో ఇది నెట్టింట వైరల్‌ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సాంగ్‌ త్వరలో విడుదల చేయనున్నారు.

ఇక శోభన ఎంత మంచి క్లాసికల్‌ డ్యాన్సరో ప్రేక్షకులకు బాగా తెలుసు. వయసు మీద పడుతున్నా ఆమె డ్యాన్స్‌లో గ్రేస్‌ మాత్రం తగ్గడం లేదు. ఇక ఈ వీడియోలో శోభనతో పాటు మరి కొందరు ఓ నది పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసిన కల్కి సెట్టింగ్‌ ముందు నృత్య ప్రదర్శన చేశారు. శోభన డ్యాన్స్‌ చేసిన పాట హిందీలో ఉండగా.. ఇది కల్కి ఆగమనాన్ని సూచించేదిగా ఉంది. మరి ఈ పాట తెలుగు వర్షన్‌ ఉందా లేదా.. పూర్తి పాటను ఎ‍ప్పుడు రిలీజ్‌ చేస్తారు అన్న దానిపై క్లారిటీ లేదు. కానీ ఈ పాటలో మరోసారి తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టి పడేసింది శోభన. పూర్తి వీడియో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక కల్కి సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. తెలంగాణలో కల్కి టికెట్‌ ధరల పెంపుకు ప్రభుత్వం ఆమోదం ఇవ్వడమే కాక.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో సింగిల్‌ థియేటర్‌ నుంచి మల్టీఫ్లెక్స్‌ల వరకు ప్రతిచోట కల్కి చిత్రాన్నే ప్రదర్శిస్తున్నారు. హైదరబాద్‌ జోన్‌ పరిధిలో కల్కి ఫస్డ్‌ డే అడ్వాన్స్‌ బుకింగ్‌ విషయంలో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. మొదటి రోజు రూ. 6 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి. రిలీజ్‌ సమాయానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. జూన్‌ 27న హైదరాబాద్‌లో తెల్లవారుజామున 4:30 గంటలకే మొదటి షో పడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి