iDreamPost

Kakinada: వాలంటీర్లపై జనసేన నాయకుల అమానుషం.. గదిలో బంధించి!

Janasena: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రతిపక్ష కూటమి పార్టీల అరాచకాలు పెరిగిపోతున్నాయని వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. వాటి మాటలు నిజం చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు వివిధ ఘటనలకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడలో జనసేన నాయకులు అమానుషంగా ప్రవర్తించారు.

Janasena: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రతిపక్ష కూటమి పార్టీల అరాచకాలు పెరిగిపోతున్నాయని వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. వాటి మాటలు నిజం చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు వివిధ ఘటనలకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడలో జనసేన నాయకులు అమానుషంగా ప్రవర్తించారు.

Kakinada: వాలంటీర్లపై జనసేన నాయకుల అమానుషం.. గదిలో బంధించి!

ఏపీలో ఎన్నికల వేడీ చాలా తీవ్ర స్థాయిలోకి చేరుకుంది. అధికార వైఎస్సార్ సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలన గురించి ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో తాము ఎలాగైన ఓడిపోతామనే భయంతో ప్రతిపక్ష కూటమికి చెందిన పార్టీలు దాడులకు, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జనసేన, టీడీపీ గూండాలు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. అందుకు నిదర్శనంగానే పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ వాలంటీర్లపై జనసేన పార్టీకి చెందిన వాళ్లు అమానుషంగా ప్రవర్తించారు. మహిళలు అని కూడా చూడకుండా.. గదిలో బంధించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన పార్టీకి చెందిన కొందరు అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను 2 గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. అంతేకాక గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. చాలా సమయం పాటు వాలంటీర్లను భయాందోళనకు గురి చేశారు. ఇక జనసేన వాళ్లు బంధించిన వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉంది. తాను గర్భవతిని అని చెప్పినా కూడా జనసేన పార్టీకి చెందిన వాళ్లు కనికరించలేదు. అసలు ఏం జరిగిందంటే.. తమ తోటి వాలంటరీ పుట్టిన రోజు కావడంతో ఆరుగురు మహిళా వాలంటీర్లు మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రింక్స్ తీసుకుని సంతోషంగా పార్టీలో గడుపుతున్నారు. ఇదే సమయంలో అక్కడి చొరపడిన జనసేన వాళ్లు దారుణంగా ప్రవర్తించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ గ్రామీణ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి  వాలంటీర్లపై దాడికి దిగారని స్థానికులు చెబుతున్నారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. ఆరుగురు వాలంటీర్లో ఏడు నెలల గర్భిణీ కూడా ఉన్న విషయాన్ని మర్చిమరీ జనసేన వాళ్లు ప్రవర్తించారని స్థానికులు చెబుతున్నారు. జనసేన దౌర్జన్యానికి ప్రగ్నెంట్ ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు.  స్థానికులు అందించిన సమాచారం పోలీసులు, ఎన్నికల అధికారులు సంఘటన స్థలానికి వెళ్లారు. అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్‌ డ్రింక్స్‌, స్వీట్స్‌ గుర్తించారు. కాగా జనసేన అభ్యర్థి పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు. అయితే ఈఘటనపై పోలీసు ఫిర్యాదుకు బాధిత వాలంటీర్లు సిద్ధమవుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి