iDreamPost

IPL 2024: వరుసగా 5 విజయాలతో బ్రేకుల్లేని బుల్డోజర్​లా RCB.. సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన యశ్ దయాళ్!

ఎవ్వరూ ఊహించని రీతిలో వరుసగా 5 మ్యాచ్ ల్లో విజయం సాధించి.. తాము ప్లే ఆఫ్స్ రేసులోనే ఉన్నామని ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఫార్ములా వల్లే మాకు వరుస విజయాలు అంటూ తమ సక్సెస్ సీక్రెట్ చెప్పేశాడు ఆ టీమ్ పేసర్.

ఎవ్వరూ ఊహించని రీతిలో వరుసగా 5 మ్యాచ్ ల్లో విజయం సాధించి.. తాము ప్లే ఆఫ్స్ రేసులోనే ఉన్నామని ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఫార్ములా వల్లే మాకు వరుస విజయాలు అంటూ తమ సక్సెస్ సీక్రెట్ చెప్పేశాడు ఆ టీమ్ పేసర్.

IPL 2024: వరుసగా 5 విజయాలతో బ్రేకుల్లేని బుల్డోజర్​లా RCB.. సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన యశ్ దయాళ్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇంటిదారి పట్టే తొలి జట్టు ఇదే అనుకున్నారు. ఎందుకుంటే? తొలి 8 మ్యాచ్ ల్లో ఒకే ఒక్క విజయంతో.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. పైగా ఆడాల్సిన మిగతా మ్యాచ్ లన్నీ గెలిచి తీరాలి. దీంతో ఆర్సీబీ ఇంటికి వెళ్లడం ఖాయమని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా పుంజుకుంది ఆర్సీబీ. ఎవ్వరూ ఊహించని రీతిలో వరుసగా 5 మ్యాచ్ ల్లో విజయం సాధించి.. తాము ప్లే ఆఫ్స్ రేసులోనే ఉన్నామని ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే తమ వరుస విజయాలకు కారణం ఏంటో చెప్పేశాడు ఆ జట్టు పేసర్.

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 47 రన్స్ తో విజయం సాధించింది ఆర్సీబీ. దీంతో ఈ సీజన్ లో వరుసగా 5 విజయాలు సాధించిన తొలి టీమ్ గా రికార్డుల్లోకి ఎక్కింది. ఇదిలా ఉండగా.. సెకండాఫ్ లో బ్రేకుల్లేని బుల్డోజర్ గా దూసుకెళ్తున్న ఆర్సీబీ విజయాలకు సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పుకొచ్చాడు ఆ టీమ్ స్టార్ పేసర్ యశ్ దయాళ్. ఆ ఫార్ములా కారణంగానే మా టీమ్ గెలుపు బాట పట్టినట్లు పేర్కొన్నాడు.

యశ్ దయాళ్ మాట్లాడుతూ..”మా టీమ్ లో సమూలమైన మార్పులు వచ్చాయి. ఐపీఎల్ ప్రారంభంలో ఓడిపోతున్నప్పుడు కూడా మేము ఎవ్వరిని నిందించలేదు. ఏ ప్లేయర్ ను కూడా విమర్శించలేదు. ఇప్పుడు అదే మా విజయానికి కారణమైంది. టీమ్ లో ఉన్న సపోర్టీవ్ వాతావరణం, కొద్దిగా పెరిగిన దూకుడు తనం ఇవన్నీ కలగలసి మా విజయాలకు కారణం అవుతున్నాయని నేను భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. విమర్శలను పట్టించుకోని వైఖరి, ప్లేయర్ల మధ్య ఉన్న బాండింగ్, డ్రెస్సింగ్ రూమ్ అట్స్మాస్పియర్ అన్నీ కలగలసి ఆర్సీబీకి ఓ బూస్ట్ లా పనిచేస్తున్నాయి. మరి ఆర్సీబీ సాధిస్తున్న వరుస విజయాలకు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి