Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 సెమీఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. నాకౌట్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు నాలుగు జట్లు రెడీ అయ్యాయి. ఇందులో గెలిచిన టీమ్స్ ఫైనల్ చేరతాయి.
టీ20 వరల్డ్ కప్-2024 సెమీఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. నాకౌట్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు నాలుగు జట్లు రెడీ అయ్యాయి. ఇందులో గెలిచిన టీమ్స్ ఫైనల్ చేరతాయి.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 సెమీఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. నాకౌట్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు నాలుగు జట్లు రెడీ అయ్యాయి. ఇందులో గెలిచిన టీమ్స్ ఫైనల్ చేరతాయి. ఇంగ్లండ్‌తో టీమిండియా, సౌతాఫ్రికాతో ఆఫ్ఘానిస్థాన్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచెస్ కోసం ఈ టీమ్స్ ఫ్యాన్స్‌తో పాటు మొత్తం క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏయే జట్లు ఫైనల్‌కు చేరతాయి? ఎవరి కథ సెమీస్‌లో ముగుస్తుందో తెలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నారు. అన్ని టీమ్స్ కూడా విజయమే లక్ష్యంగా ఆడనున్నాయి. ఆఖరి బంతి వరకు పోరాడటం తథ్యం కాబట్టి నాకౌట్ మ్యాచ్‌లు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ కానున్నాయి. ప్రేక్షకుల్ని మునివేళ్లపై నిల్చోబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సెమీస్‌పై కొందరు మాజీ క్రికెటర్లు ప్రిడిక్షన్ చెప్పడం మొదలుపెట్టారు.
టీమిండియా, సౌతాఫ్రికా ఫైనల్ చేరడం ఖాయమని కొందరు మాజీలు అంటున్నారు. ఈసారి కప్పు భారత్‌దేనని.. రాసిపెట్టుకోమని నమ్మకంగా చెబుతున్నారు. అయితే మెన్ ఇన్ బ్లూ మాజీ కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. ఈసారి భారత్ కాదు.. ఆఫ్ఘానిస్థాన్ విజేతగా నిలుస్తుందన్నాడు. ఆ టీమ్‌ను కప్పు కొట్టకుండా ఎవరూ ఆపలేరని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పొట్టి కప్పులో నయా ఛాంపియన్‌ను చూడబోతున్నామని.. అది మరెవరో కాదు, ఆఫ్ఘానిస్థాన్ అని జోస్యం పలికాడు. సెమీఫైనల్ పోరులో వికెట్ స్లోగా ఉంటే మాత్రం సౌతాఫ్రికాను రషీద్ సేన మట్టికరిపించడం ఖాయమని చెప్పాడు. ఆఫ్ఘాన్ స్పిన్ అటాక్ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు.
‘ఆఫ్ఘానిస్థాన్ ఈసారి విశ్వవిజేతగా నిలుస్తుందని అనుకుంటున్నా. నాకౌట్ మ్యాచ్‌లో పిచ్ స్లోగా ఉంటే ఆఫ్ఘాన్‌దే గెలుపు. ఆ జట్టులో వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. వారిని తట్టుకొని నిలబడటం ప్రొటీస్ బ్యాటర్ల వల్ల కాదు. ఆస్ట్రేలియా మీద ఆఫ్ఘాన్ల ఆట అందరమూ చూశాం. ఆసీస్‌ను రషీద్ సేన ఓడించడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే గత వన్డే ప్రపంచ కప్‌లో కంగారూ టీమ్‌ను వాళ్లు ఓడించినంత పని చేశారు. టెస్ట్ ప్లేయింగ్ నేషన్ అందునా వరల్డ్ ఛాంపియన్స్‌ను ఓడించడం అంటే మాటలు కాదు. ఇందుకు ఆఫ్ఘాన్‌ను అభినందించాలి. ఈ గెలుపుతో వాళ్లు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. ఇదే ఊపులో సెమీస్‌లో సౌతాఫ్రికా పని పడతారని ఆశిస్తున్నా’ అని లాల్‌చంద్ రాజ్‌పుత్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌పై గెలుపుతో ఆఫ్ఘాన్‌లో క్రికెట్‌కు మరింత ప్రజాదరణ పెరుగుతుందన్నాడు. అక్కడి యువత ఈ గేమ్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఇక మీదట ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని పేర్కొన్నాడు. మరి.. ఆఫ్ఘాన్ కప్పు గెలుస్తుందనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Lalchand Rajput “We’ll have a new T20 World Cup winner this time & it will be Afghanistan.If the wicket is slow in semi,they will be favourites to win against South Africa as they have fabulous spin attack & Proteas can be vulnerable against quality spin”pic.twitter.com/CzDgtG73nj
— Sujeet Suman (@sujeetsuman1991) June 26, 2024