iDreamPost

ఉద్యోగులకు 8 లక్షల బోనస్! భారీ ఆఫర్ ప్రకటించిన ఇన్ఫోసిస్.. ఎందుకంటే?

8 Lakhs Bonus For Employees: కంపెనీలు తమ ఉద్యోగులకు భారీగా బోనస్ లు ఇస్తుంటాయి. కంపెనీ లాభాల్లో ఉద్యోగుల శ్రమను గుర్తించి భారీగా ఆఫర్లు ఇస్తుంటాయి. అయితే ఎలాంటి లాభాలు లేకపోయినా గానీ ఇన్ఫోసిస్ కంపెనీ తమ సంస్థ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా 8 లక్షల వరకూ బోనస్ ప్రకటించింది. కారణం ఏంటంటే?

8 Lakhs Bonus For Employees: కంపెనీలు తమ ఉద్యోగులకు భారీగా బోనస్ లు ఇస్తుంటాయి. కంపెనీ లాభాల్లో ఉద్యోగుల శ్రమను గుర్తించి భారీగా ఆఫర్లు ఇస్తుంటాయి. అయితే ఎలాంటి లాభాలు లేకపోయినా గానీ ఇన్ఫోసిస్ కంపెనీ తమ సంస్థ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా 8 లక్షల వరకూ బోనస్ ప్రకటించింది. కారణం ఏంటంటే?

ఉద్యోగులకు 8 లక్షల బోనస్! భారీ ఆఫర్ ప్రకటించిన ఇన్ఫోసిస్.. ఎందుకంటే?

సాధారణంగా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్ లు ప్రకటిస్తుంటాయి. మెరుగైన పనితీరు కనబర్చినవారికి ఎక్కువగా బోనస్ లు ఇస్తుంటాయి. పండగలప్పుడు సాధారణ బోనస్ లు ఇస్తుంటాయి. ఈ బోనస్ లలో చాలా రకాలు ఉంటాయి. అయితే దేశీయ టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు కూడా బోనస్ ప్రకటించింది. ఎంప్లాయిస్ ట్రాన్స్ఫర్ పాలసీ కింద ఇన్సెంటివ్ ప్యాకేజ్ ఆఫర్ ని ప్రకటించింది. ముంబై-కర్ణాటక ప్రాంతంలోని టైర్-2 నగరంగా ఉన్న హుబ్లీలో తన ఉనికిని పెంచుకునేందుకు ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకుంది. ముంబై, కర్ణాటక ప్రాంతానికి చెందిన ఉద్యోగులను హుబ్లీలో ఉన్న క్యాంపస్ కు రప్పించేందుకు భారీ ఇన్సెంటివ్ ప్యాకేజ్ ని ఆఫర్ చేసింది.

భవిష్యత్తుని నిర్మించడానికి మీలాంటి ప్రతిభ కలిగిన ఉద్యోగుల కోసం కంపెనీ ఎదురుచూస్తుందని ఒక మెయిల్ కూడా పంపించింది. లెవల్ 3 లేదా అంతకంటే తక్కువ లెవల్ ఉద్యోగులకు రీలొకేషన్ సమయంలో ఇన్సెంటివ్ ప్యాకేజ్ కింద 25 వేలు అందిస్తారు. ఆ తర్వాత రెండేళ్లలో ప్రతీ ఆరు నెలలకొకసారి 25 వేలు ఇస్తారు. రెండేళ్లలో మొత్తం లక్ష 25 వేలు బోనస్ కింద అందుకుంటారు. ఇక లెవల్ 4 ఉద్యోగులకు ప్రారంభంలో 5 వేలు.. ఆ తర్వాత రెండేళ్లలో ప్రతి 6 నెలలకు ఒకసారి 50 వేలు చెల్లిస్తుంది. రెండేళ్లలో లెవల్ 4 ఉద్యోగులు మొత్తం రెండున్నర లక్షలు అందుకుంటారు. ఇక ఉన్నత స్థాయి ఉద్యోగులకు రీలొకేషన్ సమయంలో లక్షన్నర అందిస్తుంది. రెండేళ్లలో మొత్తం 8 లక్షలు బోనస్ గా చెల్లిస్తుంది.

ఇప్పటికిప్పుడు ఇంత అర్జెంట్ గా ఇన్సెంటివ్ ప్యాకేజ్ ని తీసుకురావడానికి కారణం.. కర్ణాటక ప్రభుత్వంతో ఇన్ఫోసిస్ కంపెనీకి ఏర్పడిన విబేధాలే అని తెలుస్తోంది. అక్కడ కొన్ని పొలిటికల్ పార్టీలు సంస్థపై ఒత్తిడి తీసుకురావడం.. స్థానికులకు ఉద్యోగాలను ఇవ్వడంలో ఇన్ఫోసిస్ విఫలమైందన్న విమర్శలు రావడం.. ఉపాధి కల్పన కింద కంపెనీకి కేటాయించిన 58 ఎకరాల భూమిని కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించడం వంటి కారణాలతో ముంబై, కర్ణాటక ప్రాంతాలకు చెందిన ఉద్యోగులను హుబ్లీకి తరలించడానికి కంపెనీ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే తమ ఉద్యోగులకు భారీ ప్యాకేజ్ ప్రకటించింది.     

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి