iDreamPost

Rains in AP: రాయల సీమకు వాతావరణ శాఖ హెచ్చరిక!

కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కురిసిన అకాల వర్షాల కారణంగా జనం అల్లాడిపోయారు. ముఖ్యంగా రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. పంటల విషయంలో...

కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కురిసిన అకాల వర్షాల కారణంగా జనం అల్లాడిపోయారు. ముఖ్యంగా రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. పంటల విషయంలో...

Rains in AP: రాయల సీమకు వాతావరణ శాఖ హెచ్చరిక!

ఇటీవల తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడా వర్షాలు పడిన సంగతి తెల్సిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురి అయ్యారు. అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాను ముప్పు పొంచి ఉందని IMD వెల్లండించింది. వాతావరణశాఖ అంచనాల ప్రకారం దక్షిణ అండమాన్‌, మలక్కా జలసంధి పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం వాయువ్య దిశగా ఈ అల్పపీడనం కొనసాగుతోంది. కాగా, గురువారం వాయుగుండంగా మారనుందని, తర్వాత అది వాయవ్య దిశగా పయనించి శనివారానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడనుందని.. IMD తెలియజేసింది.

అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రాలలో మరోసారి వర్షాలు కురిపించనుంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి గురువారం నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత, శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో.. తుఫానుగా బలపడనుందని IMD హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో రాయలసీమ ప్రాతంలో డిసెంబర్ 3 న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది. దీనితో రాయలసీమ ప్రాంతాలకు ఆరంజ్ అలెర్ట్ ను ప్రకటించారు.

ఇక కోస్తా ఆంధ్రలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4 వరకు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీనితో మత్స్యకారులంతా నవంబర్ 30 కి తీరానికి చేరుకోవాలని సూచించింది. డిసెంబర్ 5 వరకు సముద్రంలో వేటకు వెళ్ళడానికి వీలు లేదని IMD హెచ్చరించింది. ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబరు 30న గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, డిసెంబరు 2న ఇవి 80 కి.మీ. చేరుకుంటాయని IMD పేర్కొంది. కాగా, వర్షపాతం గరిష్ఠంగా 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది.

సాధారణంగా ఇది పంట చేతికి వచ్చే సమయం కావడంతో.. రైతులను మరోసారి ఈ తుఫాను కంగారు పెట్టిస్తుంది. ఇప్పటికే పడిన వర్షాల కారణంగా రైతులకు తీవ్ర పంట నష్టం కలిగింది. ఇలా వరుస వర్షాల కారణంగా రైతులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఏదేమైనా తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని, రాయలసీమ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణశాఖ ప్రకటించింది. మరి తెలుగు రాష్ట్రాలను మరోసారి ముంచెత్తనున్న ఈ భారీ వర్షాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి