P Krishna
School Holidays: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం మంగళవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
School Holidays: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం మంగళవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
P Krishna
ఈ ఏడాది జూన్ నెల వరకు ఎండలు దంచికొట్టాయి. జూన్ చివరి వారం నుంచి వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించిన వరుసగా వర్షాలు పడుతున్న వస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వర్షాల కారణంగా నదులు, జలాశయాలు, కాల్వలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అధిక వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నేడు, రేపు స్కూల్స్ కి సెలవు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా భారీ వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా కేరళా, మహారాష్ట్ర, అస్సాంలో భారీ వర్షాల కారణంగా కాల్వలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కేరశాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళా వణికిపోతుంది. పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. నార్తల్న్ మలబార్ జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో వరదలతో ఇండ్లు నీటమునిగాయి. పలు గ్రామాలు జల దిగ్భందలో ఉన్నాయి. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఎమినిది మంది చనిపోయినట్లు అధికారలు వెల్లడించారు. ఈ క్రమంలోనే అక్కడ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
ఈశాన్య కేరళలోని వయనాడ్, కన్నూర్, కాసర్ గోడ్ ప్రాంతాల్లో గ్రామాలు మొత్తం నీట మునిగిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే త్రిశూర్, ఇడుక్కీ, కొజికోడ్, ఎర్నాకులం, పల్కాడ్ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా కేరళా ప్రభుత్వం శుక్రవారం (జులై 19) సెలవు ప్రకటింది. వర్షాలు ఇలాగే కంటిన్యూ ఉంటే రేపు శనివారం కూడా సెలవు ఉండే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులు వరుసగా సెలవులు ఉండబోతున్నాయి. తెలంగాణలో మరికొన్ని రాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కేరళాలో వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ఆధికారులు తెలిపారు.