iDreamPost
android-app
ios-app

తగ్గని వానలు.. అక్కడ విద్యాసంస్థలకు సెలవులు

Heavy Rains.. మాన్ సూన్ సీజన్ మొదలవ్వక ముందే నుండి వరుణుడి ముంచెత్తుతున్నాడు. దేశ వ్యాప్తంగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

Heavy Rains.. మాన్ సూన్ సీజన్ మొదలవ్వక ముందే నుండి వరుణుడి ముంచెత్తుతున్నాడు. దేశ వ్యాప్తంగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

తగ్గని వానలు.. అక్కడ విద్యాసంస్థలకు సెలవులు

దేశ వ్యాప్తంగా ఎడ తెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, మేఘాలయ, అస్సాం, పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండకు చిల్లు పడినట్లు.. రెండు మూడు రోజుల పాటు పడుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో జలశయాలు నీటితో కళకళలాడుతుంటే.. కొన్ని చోట్ల పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. రైతులకు అపారమైన పంట నష్టం వాటిల్లుతుంది. తీవ్రమైన వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ వానల కారణంగా జన జీవనం అస్తవ్యస్థం అవుతుంది. రోడ్లపై మోకాళ్ల లోతులో నీరు చేరి.. రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు.. మహారాష్ట్రను కూడా వానలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా నాగ్ పూర్, భండారా, గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాల్లో జోరున వర్షాలు కురుస్తున్నాయి. ప్రాంతీయ వాతావరణ కేంద్రం భండారాలో సోమవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గోండియా, చంద్రాపూర, గడ్చిరోలీలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నాగ్ పూర్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లా కలెక్టర్లు జులై 22న విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వానలు కురుస్తాయన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ జిల్లాల్లో గత కొన్ని రోజులుగా వానలు కురుస్తుండటంతో దైనందిన చర్యలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నాగ్ పూర్‌లో వానలకు పలువురు మృతి చెందారు.

వరద నీటిలో పడి 12 ఏళ్ల బాలుడితో పాటు ఇద్దరు వృద్ధులు కొట్టుకుపోయారు. దీంతో ఈ జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్ డాక్టర్ విపిన్ ఇటాంకర్. ఇక్కడ పరిస్థితి తీవ్రంగా ఉన్ననేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పౌర సంస్థల, స్థానిక పరిపాలన, పోలీసు వ్యవస్థను అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు భారత వాతారవణ శాఖ నుండి అప్ డేట్స్ తీసుకోవాలని సూచించారు. ఈ వానల నుండి పౌరులకు ఉపశమనం కలిగించేలా పౌరులకు ఉపశమనం కలింగి, స్థానిక పరిపాలన, పౌర సంస్థలు మరియు పోలీసులు భారత వాతావరణ శాఖ నుండి వాతావరణంపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు తీసుకోవాలి. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను సర్వేచేయడం, వరద నియంత్రణ చర్యలు చేపట్టడం, అవసరమైన ట్రాఫిక్ ను మళ్లించడం వంటి యాక్షన్స్ తీసుకోవాలని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి