iDreamPost

రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Orange alert for Those Districts: ఏప్రిల్ మొదటి వారం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందంటే పరిస్థితి ఎంత డేంజర్ గా ఉందో అర్థమవుతుంది.

Orange alert for Those Districts: ఏప్రిల్ మొదటి వారం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందంటే పరిస్థితి ఎంత డేంజర్ గా ఉందో అర్థమవుతుంది.

రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మార్చి నెల నుంచి తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.  పలు జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీలు దాటేశాయి. దానికి తోడు మధ్యాహ్నం సమయంలో విపరీతమైన వడగాలులు వీస్తున్నాయి. నిన్న మొన్న కాస్త వర్షం పడినా పెద్దగా ఊరటనివ్వలేదు. పైగా ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  తెలంగాణలో రెండు మూడు రోజుల పాటు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారం నుంచి విపరీతమంగా ఎండలు మండుతున్నాయి. నిన్న ఆరు జిల్లాల్లో ఏకంగా 45 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. నేడు, రేపు సూర్య ప్రతాపం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంద.ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలలని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లి, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలాల్లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతుంది.

మరో రెండు మూడు రోజులు గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలతోపాటు హైదరాబాద్, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్, మేడ్చల్, కరీంనగర్, జిగిత్యాల జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఈ క్రమంలోన ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. 19,20,21 తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన జిల్లాల్లో వృద్దులు,చిన్నారులు, రోగులకు ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు. వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి