iDreamPost

రూ. 10 వేల పెట్టుబడితో.. రూ. 15 కోట్ల సంపాదన.. ఇది ఎలా సాధ్యమంటే?

రూ. 10 వేల పెట్టుబడితో రూ. 15 కోట్ల సంపాదన పొందొచ్చని అంటున్నారు హెచ్ డీఎఫ్ సీ ఏఎంసీ హెడ్ నవనీత్ మనోత్. అంత డబ్బు సంపాదించడానికి గల రహస్యాన్ని బయటపెట్టారు ఆయన.

రూ. 10 వేల పెట్టుబడితో రూ. 15 కోట్ల సంపాదన పొందొచ్చని అంటున్నారు హెచ్ డీఎఫ్ సీ ఏఎంసీ హెడ్ నవనీత్ మనోత్. అంత డబ్బు సంపాదించడానికి గల రహస్యాన్ని బయటపెట్టారు ఆయన.

రూ. 10 వేల పెట్టుబడితో.. రూ. 15 కోట్ల సంపాదన.. ఇది ఎలా సాధ్యమంటే?

ఈ మధ్యకాలంలో పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ మెంట్ మార్గాలపై ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. ఏయే రూపాల్లో పెట్టుబడి పెడితే లాభదాయకంగా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇంకా ఇతర వాటిల్లో ఇన్సెస్ట్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తాలను పొందే వాటిపై ఇన్సెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు ఇన్వెస్టర్స్. కాగా రూ. 10 వేల పెట్టుబడితో రూ. 15 కోట్ల సంపాదన పొందొచ్చని అంటున్నారు హెచ్ డీఎఫ్ సీ ఏఎంసీ హెడ్ నవనీత్ మనోత్. అంత డబ్బు సంపాదించడానికి గల రహస్యాన్ని బయటపెట్టారు ఆయన.

చాలా మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌(సిప్)ల ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించడంలో విజయం సాధించారు. హెచ్ డీఎఫ్ సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో నెలవారీ రూ. 10,000 సిప్ పెట్టుబడిదారుల మూలధనాన్ని రూ. 15 కోట్లకు పెంచిందని హెచ్ డీఎఫ్ సీ ఏఎంసీ హెడ్ నవనీత్ మనోత్ తెలిపారు. భారతదేశ మ్యూచువల్ ఫండ్ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందింది. ఇటీవల, ముంబైలో వెల్త్ క్రియేటర్ సబ్‌మిట్‌ జరిగింది. దీనిలో పలు కంపెనీల సీఈవోల బృందం పాల్గొన్నది. వీరంతా భారతీయ మూలధన మార్కెట్ యొక్క భవిష్యత్తు, అభివృద్ధి చెందుతున్న పోకడలు, సవాళ్లు మరియు వ్యాపార అవకాశాల గురించి చర్చించారు.

హెచ్ డీఎఫ్ సీ అసెట్ మేనేజ్‌మెంట్ ఎండీ నవనీత్ మనోత్ మాట్లాడుతూ.. మ్యూచువల్ ఫండ్‌లలో నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ మొత్తం రూ. 17000 కోట్లు దాటిందన్నారు. మ్యూచువల్ ఫండ్ మార్కెట్ విలువ బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. వచ్చే 3 ఏళ్లలో ఈ మొత్తాన్ని రెట్టింపు చేయవచ్చని నవనీత్ మనోత్ చెప్పారు. 2017 సంవత్సరంలో, భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ మార్కెట్ లో నెలవారీ పెట్టుబడి రూ. 4000 కోట్లు, 2018 సంవత్సరంలో అది రూ. 8000 కోట్లకు పెరిగింది, అయితే 2023 సంవత్సరంలో అది రూ. 17000 కోట్లుగా ఉందని అన్నారు. ఓ పెట్టుబడిదారుని ఉదాహరణగా చెబుతూ హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో నెలకు రూ.10వేల చొప్పున 25 నుంచి 30 ఏళ్లు పెట్టుబడులు పెడితే 18-19 శాతం వడ్డీ ఇలా అసలు వడ్డీ మొత్తం కలుపుకుని రూ.15 కోట్లుగా మారుతుందని నవనీత్ మనోత్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు అత్యుత్తమం అంటూ నవనీత్ మనోత్‌ వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి