iDreamPost

పవన్ ని తిట్టి పోస్తున్న ఫ్యాన్స్.. కవర్ చేస్తూ హైపర్ ఆది వీడియో!

Netizens Counters To Hyper Aadi: కమెడియన్ హైపర్ ఆది సడెన్ గా రాజకీయ వ్యాఖ్యలు మొదలు పెట్టాడు. పవన్ కల్యాణ్ ని తిట్టద్దు అంటూ వీడియో విడుదల చేశాడు. కానీ, ఇప్పుడు అతనికే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Netizens Counters To Hyper Aadi: కమెడియన్ హైపర్ ఆది సడెన్ గా రాజకీయ వ్యాఖ్యలు మొదలు పెట్టాడు. పవన్ కల్యాణ్ ని తిట్టద్దు అంటూ వీడియో విడుదల చేశాడు. కానీ, ఇప్పుడు అతనికే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

పవన్ ని తిట్టి పోస్తున్న ఫ్యాన్స్.. కవర్ చేస్తూ హైపర్ ఆది వీడియో!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. సొంత పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీ నాయకులే పవన్ కల్యాణ్ ఆలోచన, నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ప్రశ్నిస్తూ, పార్టీని వీడుతున్న పరిస్థుతులు చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీతో పొత్తులో కేవలం 24 సీట్లకే పరిమితం కావడం పట్ల వాళ్లంతా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది కార్యకర్తలు పార్టీని వీడారు.. చాలామంది మేమిక మీతో నడవలేం అంటూ తెగేసి చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో కమెడియన్ హైపర్ ఆదీ వచ్చి పవన్ కల్యాణ్ ను తిట్టద్దు అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయితే కార్యకర్తల బాధను ఆది ఏమాంత్రం అర్థం చేసుకున్నాడని ఇలాంటి వ్యాఖ్యలు చేశాడో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది.

ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ- జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిందో.. ఎప్పుడైతే పవన్ కల్యాణ్ పార్టీకి 24 సీట్లు ఇస్తున్నామంటూ వెల్లడించారో.. అప్పటి నుంచే జనసైనికుల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. ఎందుకు అసలు మనం ఈ పార్టీ జెండాలు మోయాలి అంటూ కార్యకర్తలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. పదేళ్లుగా పార్టీని నమ్ముకున్న నాయకులు కూడా రోడ్డున పడి గుండెలు పగిలేలా రోధించడం చూశాం. నాయకుడ్ని నమ్ముకుంటే నట్టేట ముంచేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు హైపర్ ఆదీ వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు.

“పట్టుకున్న జెండాని వదిలేస్తున్నారు, స్టిక్కర్లు పీకేస్తున్నారు, పవన్ కల్యాణ్ ని తిడుతున్నారు, పోస్టర్లు కాల్చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు బాధగా ఉంది. అందుకే నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఆయన అలా ఎందుకు చేశారో ఆలోచించండి” అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయం గురించి నిజంగానే ఆలోచించాలి. హైపర్ ఆది ప్రముఖ కమెడియన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన షోలు తాను చేసుకుంటూ.. ఎప్పుడో ఒకసారి వచ్చి నేను పవన్ కల్యాణ్ అభిమానిని, జనసేన పార్టీ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అందుకు అతనికి సినిమాల పరంగా బాగానే వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు హైపర్ ఆదికి నెట్టింట కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

గత పదేళ్లుగా పార్టీ జెండాని తమ భుజాన మోస్తున్న ఒక సగటు కార్యకర్త బాధ నిజంగానే ఆదికి అర్థమైందా? పార్టీని, పార్టీ నాయకుడిని నమ్ముకుని పదేళ్లుగా తమ ఉనికి కోసం పోరాడుతున్న నాయకుల బాధ ఆదికి అర్థమైందా? ఇప్పుడు వచ్చేసి అర్థం చేసుకోండి అని వ్యాఖ్యలు చేస్తే.. అసలు అర్థం చేసుకోవాల్సింది ఎవరు? కార్యకర్తలు- నాయకులా? హైపర్ ఆదీనా? ఈ ప్రశ్నకు హైపర్ ఆదీనే సమాధానం చెప్పాలి అంటున్నారు. పవన్ నిర్ణయం వల్ల ఎంత బాధ పడ్డారో.. ఎంతమంది నాయకులు ఆవేదన చెందారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హరిరామజోగయ్య లాంటి కాపు నేతలు కూడా బాహాటంగానే పవన్ కల్యాణ్ ను ప్రశ్నిస్తున్నారు. వాళ్లు పవన్ ని తక్కువ చేస్తున్నట్లు కాదు.. తనని తానే తక్కువ చేసుకోవద్దు అని హితవు పలుకుతున్నారు. ఈ విషయాలు కూడా హైపర్ ఆదికి అర్థం కావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి తిట్టకండి ప్లీజ్ అనడానికి ముందు.. తమవైపు నుంచి కూడా ఆలోచించి మాట్లాడుంటే ఇంకా బాగుండేది అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. మరి.. ఆదికి ఎదురవుతున్న ప్రశ్నలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి