iDreamPost

ఈ వరల్డ్ కప్​లో భారత్​కు అతడే బిగ్ ప్లస్.. అలాంటోడే కావాలి: భజ్జీ

  • Published Jun 18, 2024 | 8:32 AMUpdated Jun 18, 2024 | 8:32 AM

పొట్టి కప్పులో టీమిండియా పెర్ఫార్మెన్స్​పై స్పిన్ లెజెండ్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కాదు.. భారత జట్టుకు ఇప్పుడు అతడే బిగ్ ప్లస్ అని అన్నాడు.

పొట్టి కప్పులో టీమిండియా పెర్ఫార్మెన్స్​పై స్పిన్ లెజెండ్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కాదు.. భారత జట్టుకు ఇప్పుడు అతడే బిగ్ ప్లస్ అని అన్నాడు.

  • Published Jun 18, 2024 | 8:32 AMUpdated Jun 18, 2024 | 8:32 AM
ఈ వరల్డ్ కప్​లో భారత్​కు అతడే బిగ్ ప్లస్.. అలాంటోడే కావాలి: భజ్జీ

టీ20 ప్రపంచ కప్​-2024లో టీమిండియా అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో ప్రత్యర్థులను భయపెడుతోంది. గ్రూప్ స్టేజ్​లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గి సూపర్-8కు చేరుకుంది రోహిత్ సేన. నెక్స్ట్ స్టేజ్​ మ్యాచ్​ల కోసం ఎదురు చూస్తోంది. సూపర్ పోరులో ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్​, బంగ్లాదేశ్​ను చిత్తు చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ టీమ్స్​ను ఓడించి సెమీస్ బెర్త్​ను కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తోంది. అయితే ఇప్పటిదాకా అమెరికాలోని ట్రిక్కీ పిచ్​లపై ఆడిన మెన్ ఇన్ బ్లూ.. ఇక మీదట కరీబియన్ దీవుల్లో ఆడనుంది. అక్కడి స్లో పిచ్​ల మీద ఆడటం అలవాటైన ఆసీస్, ఆఫ్ఘాన్​ను ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. అందుకు సరికొత్త ప్రణాళికలతో రావాల్సి ఉంటుంది. బ్యాటింగ్ విభాగం మరింత ఊపందుకోవాలి.

టీమిండియా బౌలింగ్ యూనిట్ అద్భుతంగా రాణిస్తోంది. ఇదే ఫామ్​ను విండీస్ పిచ్​ల మీదా కంటిన్యూ చేస్తే భారత్​ను ఆపడం ఏ టీమ్ వల్ల కూడా కాదు. జస్​ప్రీత్ బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా, అర్ష్​దీప్ సింగ్ ఇదే జోరును కొనసాగించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మెగా టోర్నీలో మెన్ ఇన్ బ్లూ ఆడుతున్న తీరు మీద అతడు హర్షం వ్యక్తం చేశాడు. టీమిండియా ఇలాగే ఆడాలని అన్నాడు. ఈ వరల్డ్ కప్​లో భారత్​కు బిగ్ ప్లస్ అంటే హార్దిక్ పాండ్యానే అంటూ ప్రశంసల జల్లులు కురిపించాడు. అలాంటోడే జట్టుకు కావాలని అన్నాడు. విరాట్ కోహ్లీ కంటే పాండ్యానే టీమ్​కు కీలకమని.. అతడు రాణించడం ఎంతో అవసరమని చెప్పాడు.

‘ఈ ప్రపంచ కప్​లో భారత్​కు పెద్ద సానుకూల అంశం అంటే అది హార్దిక్ పాండ్యా బౌలింగ్ అనే చెప్పాలి. బాల్​తో అతడు రాణిస్తున్న తీరు అద్భుతం. హయ్యెస్ట్ వికెట్ టేకర్స్ లిస్ట్​లో అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు. పాండ్యా బ్యాట్​తో రాణిస్తాడని అంతా అనుకున్నారు. బౌలింగ్​తో ఫర్వాలేదనేలా పెర్ఫార్మ్ చేసినా చాలని భావించారు. అతడిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ అతడు బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. ఇలాంటోడే జట్టుకు కావాలి. హార్దిక్​తో పాటు రిషబ్ పంత్ గురించి కూడా చెప్పాలి. రీఎంట్రీలో ఇంత బాగా ఆడటం మామూలు విషయం కాదు. రెగ్యులర్​గా కోహ్లీ ఆడే మూడో నంబర్​లో దిగుతూ అతడు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతున్నాడు. ఆ స్పాట్​లో సంజూ శాంసన్ ఆడతాడని అనుకుంటే ఆ ఛాన్స్​ను పంత్ కొట్టేశాడు. పంత్ ఆ ప్లేస్​లో ఆడటం వల్ల రైట్-లెఫ్ట్ కాంబో కూడా సెట్ అయింది’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి