iDreamPost

ఈ వారం OTT లోకి వచ్చేస్తున్న మలయాళీ మూవీస్ ఇవే ! ఆ ఒక్కటీ చాలా స్పెషల్

  • Published Jun 26, 2024 | 7:20 PMUpdated Jun 26, 2024 | 7:20 PM

Upcoming Malayam Movies In OTT: మలయాళీ సినిమాలు ప్రేక్షకులను మాయ చేస్తున్నాయని చెప్పి తీరాలి. ప్రత్యేకించి మలయాళీ సినిమాలు ఏమేం వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. మరి ఈ వారం ఓటీటీ లో వచ్చే మలయాళ సినిమాలేంటో చూసేద్దాం.

Upcoming Malayam Movies In OTT: మలయాళీ సినిమాలు ప్రేక్షకులను మాయ చేస్తున్నాయని చెప్పి తీరాలి. ప్రత్యేకించి మలయాళీ సినిమాలు ఏమేం వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. మరి ఈ వారం ఓటీటీ లో వచ్చే మలయాళ సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Jun 26, 2024 | 7:20 PMUpdated Jun 26, 2024 | 7:20 PM
ఈ వారం OTT లోకి వచ్చేస్తున్న మలయాళీ  మూవీస్ ఇవే ! ఆ ఒక్కటీ  చాలా స్పెషల్

ఒకప్పటికంటే.. ఇప్పుడు థియేటర్స్ లో కానీ, ఓటీటీ లో కానీ మలయాళ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోతుంది. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ , క్రైమ్, మిస్టరీ , థ్రిల్లర్ ఇలా అన్ని జోనర్స్ సినిమాలు.. ప్రేక్షకులను బాగా మెప్పించేస్తున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే.. మలయాళీ సినిమాలు ప్రేక్షకులను మాయ చేస్తున్నాయని చెప్పి తీరాలి. ఎప్పుడెప్పుడు ఓటీటీ లో మలయాళీ సినిమాలు వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటున్నారు. మరి ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లోకి వచ్చే సరికొత్త మలయాళీ సినిమాలేంటో.. అవి ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కానున్నాయి చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో రిలీజ్ కానున్న మలయాళీ సినిమాలు ఇవే..

గురువాయూర్ అంబలనడయిల్:

పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన కామెడీ ఎంటర్టైనర్.. గురువాయూర్ అంబలనడయిల్. ఈ వీకెండ్ లో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఈ సినిమా జూన్ 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

నడికర్ :

టీవీనో థామస్ నటించిన ఈ సినిమా .. ప్రేక్షకులను ఎంతో మెప్పించింది. ఇక థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీ లో చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా జూన్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

టర్బో :

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన టర్బో సినిమా కోసం ఎంతో మంది ప్రేక్షకులు.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ.. సోని లివ్ లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది అని సమాచారం.

మలయాళీ ఫ్రమ్ ఇండియా:

రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలు చూసి బోర్ కొట్టేసి.. ఓ మంచి ఎమోషనల్ కామెడీ డ్రామా చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఇక ఈ సినిమా జులై 5 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

కాబట్టి ఎంచక్కా ఈ వారం ఈ మలయాళీ సినిమాలను మిస్ కాకుండా చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి