iDreamPost

వీడియో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి KTR సవాల్

KTR Challenge To CM Revanth: మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. సీఎం పదవికి రాజీనామా చేసి రావాలంటూ వ్యాఖ్యానించారు.

KTR Challenge To CM Revanth: మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. సీఎం పదవికి రాజీనామా చేసి రావాలంటూ వ్యాఖ్యానించారు.

వీడియో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి KTR సవాల్

తెలంగాణ రాష్ట్రంలో అధికార- ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ పాలనకు సంబంధించి ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే.. ఇటు ప్రతిపక్ష నేతలు కూడా వాటికి కౌంటర్స్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరీశ్ రావు నేరుగా ముఖ్యమంత్రికి సవాలు విసిరిన విషయం తెలిసిందే. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే.. తానే సీఎం సీటులో కూర్చుంటానంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాలు విసిరారు. తన పదవికి రాజీనామా చేయాలి అంటూ వ్యాఖ్యానించారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికార- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సవాళ్లు ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకొంది. దమ్ముంటే ఒక్క లోక్ సభ స్థానాన్ని గెలుచుకుని చూపించాలంటూ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీకి సవాలు విసిరిన విషయం తెలిసిందే. ఈ సవాలుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అంతేకాకుండా ప్రతిగా ఆయన కూడా ఒక సవాలు విసిరారు. అంతేకాకుండా గెలిచిన ప్రతిసారి మగవాడిని.. ఓడితే కాదు అంటావా? ప్రశ్నించారు.

మగవాడివి అయితే రైతు భరోసా స్టార్ట్ చేయ్.. 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయ్ అని అడగచ్చు. మగవాడివి అయితే మహాలక్ష్మి పథకం స్టార్ట్ చేయ్.. కోటీ 67 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వు అని అడగచ్చు. ఒక్కటే ఒక సీటు కూడా గెలవము అంటున్నారు మీరు. నేను ఒకటే సవాలు చేస్తున్నా. నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను. మీరు ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలి. మీ సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరి.. ఆ ఒక్క సీటులోనే తేల్చుకుందాం.  రాష్ట్రం మొత్తం అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నారు.

మల్కాజ్ గిరి స్థానంలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు? ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు. కాబట్టి గెలుపోటములను పట్టుకుని వాటిని ఎక్కువగా ఊహించుకుని.. తన శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఊహించుకుని మాట్లాడుతున్నారు. మీరు రాజీనామా చేసి రండి.. నేను కూడా రాజీనామా చేసి వస్తాను. ఇద్దరం మల్కాజ్ గిరి నియోజకవర్గంలోనే తేల్చుకుందాం” అంటూ మాజీ మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. పదే పదే మేనేజ్మెంట్ కోటా లీడర్ అనడంపై కూడా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలుచేశారు. తనది మేనేజ్మెంట్ కోటా అయితే.. రాహుల్ గాంధీ, ప్రియాంకలది ఏ కోటా అంటూ ప్రశ్నించారు. మరి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాలు విసరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి